Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓహియోలో జింకకు కరోనా పాజిటివ్

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 29 ఆగస్టు 2021 (11:26 IST)
deer
అమెరికాలో ఓ జింకకు కరోనా వైరస్ సోకింది. ఇప్పటికే మానవాళిని వణికిస్తున్న ఈ వైరస్.. ఇపుడు జంతువులకు కూడా క్రమంగా సోకుతుంది. ఇప్పటివరకు కుక్కలు, పిల్లులు, గొరిల్లాలు, చిరుతలు, సింహాలు కరోనా బారినపడగా.. తాజాగా అమెరికాలో ఓ జింకకు కరోనా పాజిటివ్ వచ్చింది. 
 
ఓహియో రాష్ట్రంలో ఓ అడవి తెల్ల తోక జింకకు వైద్య పరీక్షలు నిర్వహించగా, అది వైరస్ బారినపడిన విషయం వెల్లడైంది. జంతువుల నుంచి మనుషులు - జంతువుల మధ్య కరోనా వ్యాప్తిపై ఓహియో స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన వెటర్నరీ కాలేజి పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. 
 
ఈ క్రమంలో కొన్ని జంతువులకు కరోనా పరీక్షలు నిర్వహించగా, ఒక జింకకు కరోనా సోకిన విషయాన్ని గుర్తించారు. జింకకు కరోనా సోకడం ఇదే తొలిసారి. అయితే ఆ జింకకు కరోనా ఎలా సోకిందన్నది ఇంకా తెలియరాలేదు.

అన్నీ చూడండి

Varun Tej: అభిమానుల పట్ల మరోసారి పెద్ద మనసు చాటుకున్న వరుణ్ తేజ్

Sharwa : భోగి కోసం భారీ క్లైమాక్స్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న శర్వా

Ajay Bhupathi: ఆర్‌ఎక్స్ 100 తర్వాత కొత్త వాళ్లతో పని చేయకూడదనుకున్నా : అజయ్ భూపతి

చిన్నప్పుడు మా మావయ్య ఒడిలో కూర్చోబెట్టుకుని అసభ్యంగా ప్రవర్తించేవాడు: నటి శివాంగి

Vijay Deverakonda:.హాలీవుడ్ టెక్నీషియన్స్ స్థాయికి ఎదిగిన విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments