శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 30 జులై 2021 (19:31 IST)

టీమిండియాను వదలని కరోనా రక్కసి.. ఆ ఇద్దరికి పాజిటివ్

Team India
శ్రీలంక పర్యటన ముగిసినా టీమిండియాను కరోనా వదలట్లేదు. మరో ఇద్దరు భారత క్రికెటర్లకు కరోనా సోకింది. రెండు రోజుల క్రితం కృనాల్ పాండ్యాకు పాజిటివ్‌గా నిర్ధారణ కాగా తాజాగా లెగ్ స్పిన్నర్ యుజ్వేందర్ చాహల్, స్పిన్ బౌలర్ కమ్ ఆల్ రౌండర్ కృష్ణప్ప గౌతమ్ కరోనా బారిన పడ్డారు.
 
ఇప్పటికే ఐసోలేషన్‌లో ఉన్న కృనాల్ పాండ్యాతో సన్నిహితంగా ఉన్న కారణంగా వీరిద్దరికీ కరోనా సోకినట్లు తెలుస్తోంది. కృనాల్ పాండ్యాతో కాంటాక్టులో ఉన్న ఎనిమిది మంది ఆటగాళ్లు ఐసోలేషన్ లో ఉన్నారు. తాజాగా వీరికి టెస్టులు నిర్వహించగా చాహల్, గౌతమ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది.
 
శ్రీలంక పర్యటన ముగిసినా ఐసోలేషన్ లో ఉన్న చాహల్, గౌతమ్, కృనాల్ పాండ్యా ఇప్పట్లో భారత్ కు తిరిగిరారు. శ్రీలంకలో హెల్త్ ప్రోటోకాల్స్ ప్రకారం కరోనా సోకినా వారు తప్పకుండా పది రోజులు ఐసోలేషన్ లో ఉండాలి.