దేశంలో పెరిగిపోతున్న కేసులు.. 24 గంటల్లో 56వేల మందికి కరోనా
దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో గత పది రోజులుగా 50వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 56 వేలకుపైగా కరోనా కేసులు రికార్డయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా కేసులు 20 లక్షలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 56,282 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 19,64,537కు చేరింది.
ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 5,95,501 మంది బాధితులు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. మరో 13,28,337 మంది కోలుకున్నారు. తాజాగా కరోనా బారినపడినవారిలో 904 మంది మరణించారు. ఒకేరోజు ఇంత పెద్ద సంఖ్యలో బాధితులు మరణించడం ఇదే మొదటిసారి. దీంతో కరోనా మృతులు 40,699కు చేరారు. దేశంలో రికవరీ రేటు 67 శాతం దాటిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశంలో ఇప్పటివరకు 6,64,949 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది. ఆగస్టు 5న 2,21,49,351 మందికి కరోనా పరీక్షలు చేశామని తెలిపింది.