గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Modified: మంగళవారం, 28 జులై 2020 (18:31 IST)

ఏపీలో 24 గంటల్లో 7,948 కొత్త కేసులు: 58 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తున్నది. గడిచిన 24 గంటల్లో 7,948 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 62,979 శాంపిల్స్‌ను పరీక్షించగా 7,948 మంది కోవిడ్ 19 పాజిటివ్‌గా తేలారు. 3,064 మంది చికిత్స నిమిత్తం కోలుకున్నారు. 
 
కోవిడ్ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో కరోనా వల్ల గుంటూరులో 11 మంది, కర్నూలులో 10 మంది, విశాఖలో 9 మంది, చిత్తూరులో ఐదుగురు, కృష్ణాలో నలుగురు, నెల్లూరులో నలుగురు, అనంతపూర్‌లో ముగ్గురు, కడపలో ఒక్కరు, శ్రీకాకుళం ఒక్కరు, పశ్చిమగోదావరి ఒక్కరు మరణించినట్లు ప్రభుత్వ బులెటిన్ తెలిపింది.
 
రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,07,402 ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందినవారు 1148, ఇప్పటివరకు వివిధ ఆస్పత్రులలో చికిత్స పొంది కోలుకున్నవారి సంఖ్య 49,745కి చేరింది. ప్రస్తుతం వివిధ కోవిడ్ ఆస్ప త్రులలో 56,509 మంది చికిత్స పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 62,979 కరోనా శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటివరకు ఏపీలో 17,49,425 కరోనా శాంపిల్స్ నిర్వహించింది ప్రభుత్వం.