శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

28-07-2020 మంగళవారం రాశిఫలాలు - స్త్రీలకు ఆరోగ్యంలో చికాకులు..

మేషం : వైద్యులకు ఏకాగ్రత చాలా అవసరం. రేపటి సమస్య గురించి అధికంగా ఆలోచిస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఉపాధ్యాయులకు తొందరపాటుతనం వల్ల సమస్యలు తలెత్తుతాయి. వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి బాగా శ్రమించాలి. కుటుంబీకుల మొండివైఖరి అసహనం కలిగిస్తుంది.
 
వృషభం : పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం వసూలు విషయంలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు మంచి ఫలితాలను ఇస్తాయి. 
 
మిథునం : వస్త్ర, వ్యాపారులు పనివారాలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ, ఏకాగ్రత అవసరం. ఓర్పుతో వ్యవహారాలు చక్కదిద్దుకుంటారు. బంధు మిత్రుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల వ్యవహారాల పునరాలోచన అవసరం. 
 
కర్కాటకం : రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. నిబద్ధత, క్రమశిక్షణతో మీరు కోరుకుంటున్న గమ్యాన్ని సులువుగా చేరుకోవచ్చు. ఆలయ సందర్శనాలలో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. ఆపదసమయంలో బంధువులు అండగా నిలుస్తారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
సింహం : ఉద్యోగస్తులు అధికారులను మెప్పించడానికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. హోటల్, తినుబండారాల వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు పనివారలతో చికాకులను ఎదుర్కొంటారు. కుటుంబీకులతో చికాకులు ఎదుర్కొనక తప్పదు. బాకీలు, ఇతరాత్రా రావలసిన ఆదాయాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. 
 
కన్య : రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగరీత్యా ప్రయాణం చేయవలసి వస్తుంది. సోదరీ, సోదరుల కలయిక పరస్పర అవగాహన కుదురును. స్త్రీలకు ఆరోగ్యంలో చికాకులు తలెత్తినాగానీ నెమ్మదిగా సమసిపోతాయి. బ్యాంకింగ్ వ్యవహారాలు, ప్రయాణాలలో మెళకువ వహించండి.
 
తుల : చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. దైవ, సేవ, పుణ్యకార్యాలయాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. విద్యార్థులకు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. పత్రికా సిబ్బందికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. వైద్యులకు ఆపరేషన్లలో ఏకాగ్రత అవరం.
 
వృశ్చికం : ఆర్థిక వ్యవహారాలు గోప్యంగా ఉంచడం క్షేమదాయకం. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. పన్నులు, ఫీజులు, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల వారికి ఒత్తిడి, తిప్పట తప్పదు. కళలు, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. రాజకీయాలలోని వారు ఆచితూచి వ్యవహరించవలెను. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. 
 
మకరం : సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాల్లో స్వల్ప ఒడిదుడుకులు, చికాకులు ఎదుర్కొంటారు. అందివచ్చిన అవకాశం చేజారినా మంచికేనని భావించండి. విద్యా సంస్థలలోని వారికి ఉపాధ్యాయులకు అనుకూలమైన కాలం. భాగస్వామికులకు మీ సమర్థతపై నమ్మకం కలుగుతుంది. 
 
కుంభం : ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదు అని గమనించండి. రియల్ ఎస్టేట్, చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు అటుపోట్లు అధికమవుతాయి. వాయిదాపడిన మొక్కుబడులు తీర్చుకుంటారు. స్త్రీలకు ఏ విషయంలోనూ మనస్థిమితం అంతగా ఉండదు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. 
 
మీనం : శ్రీవారు, శ్రీమతి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం నిరీక్షణ తప్పదు. రిప్రజెంటేటివ్‌లకు నెమ్మెదిగా మార్పులు కానరాగలవు. న్యాయ, బోధనా రంగాల వారికి అనుకూలం. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. ప్రత్యర్థుల కదలిక పట్ల ఓ కన్నేసి ఉంచండి.