శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

26-07-2020 ఆదివారం రాశిఫలాలు - మీ సంకల్పానికి నిరంతర శ్రమ...

మేషం : స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. రాజకీయ నాయకులు, వాగ్ధాటితో అందరినీ ఆకట్టుకుంటారు. శారీరక శ్రమ, విశ్రాంతి లోపం వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. ఇతరులకు ఇచ్చిన ధనం తిరిగి రాబట్టుకోవడం సాధ్యం కాదని గమనించండి. మీ సరదాలు, కోరికలు, వాయిదావేసుకోవలసి వస్తుంది. 
 
వృషభం : పత్రికా ప్రైవేటు సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. తలపెట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటరు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. స్వశక్తితో పైకొచ్చిన మీరు, మరింత ముందుకెళ్లాలంటే తగిన సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. 
 
మిథునం : స్త్రీల తెలివిటేతలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. మీ సంకల్పానికి నిరంతర శ్రమ, పట్టుదల చాలా అవసరమని గమనించండి. 
 
కర్కాటకం : కానివేళలో బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. క్రయ, విక్రయ రంగాల వారికి మెళకువ అవసరం. వాతావరణంలో మార్పుతో స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన మార్పులుంటాయి. 
 
సింహం : పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి చికాకులు, ఒత్తిడి తప్పదు. రేషన్ డీలర్లకు అధికారుల నుంచి వేధింపులను ఎదుర్కొంటారు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. 
 
కన్య : రాజకీయ నేతలకు విదేశీ ప్రయాణములు, ఉన్నత పదవులపై మైత్రి అధికమవుతుంది. అనవసరపు విషయాలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. కొత్త టెండర్ల విషయంలో పునరాలచో అవసరం. బ్యాకరీ, తినుబండరాలు, పూల వ్యాపారులకు కలిసి వచ్చును. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువను దక్కించుకుంటారు. 
 
తుల : వైద్యులు ఆపరేషన్లు చేయునపుడు ఏకాగ్రత అవసరం. ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. షాపింగులో దుబారా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు, ఆటంకాలు ఎదుర్కొంటరు. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. 
 
వృశ్చికం : మీ అభిప్రాయాలు, నిర్ణయాలను సూటిగా వ్యక్తం చేయండి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మీ సరదాలు, కోరికలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. రావలసిన ధనంలో కొంత మొత్తం వసూలు కాగలదు. తాపి పనివారలకు వాతావరణంలోని మార్పు వల్ల చికాకులు తప్పవు. 
 
ధనస్సు : ఉద్యోగంలో శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. పత్రికా సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. ఏసీ, కూలర్ మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. రుణం తీర్చి తాకట్టువస్తువులు విడిపించుకుంటారు. విద్యార్థులకు టెక్నికల్, కంప్యూటర్ సైన్సులో ప్రవేశం లభిస్తుంది. 
 
మకరం : చిన్ననాటి వ్యక్తులను కలుసుకుంటారు. రావలసిన ధనం లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ఆత్మీయుల కలయికతో మానసికంగా కుదటపడతారు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి బాగా శ్రమించాలి. 
 
కుంభం : ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. ఆత్మీయుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు, పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. పాతవస్తువులను కొనడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. స్త్రీలకు సంపాదన, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. 
 
మీనం : బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల అవసరం. ఊహించని ఖర్చుల వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. మీ పరోపకార బుద్ధి మీకు సమస్యలు తెచ్చిపెడుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. చిట్స్, ఫైనాన్స్, వ్యాపారులకు ఖాదారులతో సమస్యలు తప్పవు.