శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : శుక్రవారం, 16 ఆగస్టు 2019 (09:02 IST)

#DailyPredictions 16-08-2019- శుక్రవారం మీ రాశి ఫలితాలు.. ప్రేమికుల తొందరపాటు..?

మేషం: ఆడిటర్లకు చికాకులు తప్పవు. ప్రేమికుల తొందరపాటుతనం సమస్యలకు దారితీస్తుంది. నిరుద్యోగులకు నిరుత్సాహం తప్పదు. వాతావరణంలో మార్పు వ్యవసాయదారులకు ఎంతో సంతృప్తినిస్తుంది. కోర్టు వ్యవహారాలలో మెళుకువ అవసరం. ముఖ్యలతో ఆకస్మిక అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. జాగ్రత్త వహించండి.
 
వృషభం: దైవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు అతి కష్టంమ్మీద పూర్తి చేస్తారు. గృహోపకరణాలు, వాహనం కొనుగోలు చేస్తారు. మీ సంతానం మొండివైఖరి వల్ల చికాకులు తప్పవు. కీలకమైన వ్యవహారాలు మీ జీవితభాగస్వామికి తెలియజేయటం క్షేమదాయకం. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి.
 
మిధునం: చిట్స్, ఫైనాన్సు సంస్ధల వారికి ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. దైవ కార్యాల్లో చురుకుగా వ్యవహారిస్తారు. కుటుంబ సౌఖ్యం, సోదరుల నుండి ఆదరణ పొందుతారు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి.
 
కర్కాటకం: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. సోదరులతో కీలకమైన విషయాలు చర్చలు జరుపుకుంటారు. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు మెళుకువ, ఏకాగ్రత చాలా అవసరం. రాబడికి మించిన ఖర్చులు అందోళన కలిగిస్తాయి. ధనవ్యయం అధికమైనా సంతృప్తి, ప్రయోజనకరంగా ఉంటాయి.
 
సింహం: ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. వాయిదాపడిన పనులు పునఃప్రారంభిస్తారు. స్త్రీలకు ఆరోగ్యం కుదుటపడుతుంది. వస్త్ర, బంగారం, వెండి, ఫాన్సీ వ్యాపారులకు పనివారలతో చికాకులు తప్పవు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది.
 
కన్య: సాహిత్య, కళారంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. సభలు, సన్మానాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. గత కొంతకాలంగా ఎదుర్కుంటున్న సమస్యలు పరిష్కారం కాగలవు. ఆకస్మిక ప్రయాణాలు తప్పవు. విలువైన పత్రాలు, వస్తువుల విషయంలో జాగ్రత్త వహించండి.
 
తుల: మీ ఆర్థికస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. వ్యవసాయ రంగాల వారికి చికాకులు అధికం. పత్రికా, వార్తా సంస్థలలోని వారికి ఏకాగ్రత, పునరాలోచన అవసరం. యూనియన్ వ్యవహారాలు, అధికారులతో చర్చలు ఆందోళన కలిగిస్తాయి. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు జయం, వైద్యరంగాల వారికి ఏకాగ్రత ముఖ్యం.
 
వృశ్చికం: ఒకేసారి అనేక పనులు మీదపడటంతో ఒత్తడికి గురవుతారు. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. స్త్రీలు టీవీ కార్యక్రమాల్లో గుర్తింపు లభిస్తుంది. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరం. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి.
 
ధనస్సు: వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి క్రమంగా నిలదొక్కుకుంటారు. ఏ యత్నం కలిసిరాక నిరుద్యోగులు నిరుత్సాహం చెందుతారు. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి ఆశాజనకం. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. పనివారలను ఓ కంట కనిపెట్టటం మంచిది. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
మకరం: ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. క్రీడ, కళాకారులకు ఆదరణ లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు, ఆస్తివివాదాలు ఎంతకీ పరిష్కారం కాక విసుగు చెందుతారు. మీ శ్రీమతి గొంతెమ్మ కోరికలు ఇరకాటానికి గురి చేస్తాయి.
 
కుంభం: ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు విరుద్ధంగా ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. నిరుద్యోగుల ఆలోచనలు ఉపాథి పథకాలు దిశగా సాగుతాయి. ఉద్యోగస్తులకు బాధ్యతల నిర్వహణలో అధికారులు, తోటివారి సహకారం అందుతుంది. ఆరోగ్యం, ఆహార విషయాల్లో జాగ్రత్త వహించండి.
 
మీనం: ఉన్నతాధికారుల హోదా పెరగటంతో పాటు స్థానచలనం ఉంటుంది. బంధువుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కుంటారు. పాత రుణాలు తీరుస్తారు. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారుల ఒత్తడి అధికం. అప్రయత్నంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. ఊహించని పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది.