సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : మంగళవారం, 27 ఆగస్టు 2019 (09:08 IST)

#DailyPredictions 27-08-2019- మంగళవారం మీ రాశి ఫలితాలు

మేషం: ఉద్యోగ, వ్యాపారాల్లో స్వల్ప ఆటుపోట్లు ఎదుర్కోవలసి వస్తుంది. మీ వాహనం ఇతరులకు ఇవ్వటం వల్ల ఇబ్బందులకు గురికాక తప్పదు. ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు అధికం. ఆధ్యాత్మిక విషయాలు, పుస్తక పఠనంతో కాలక్షేపం చేస్తారు. వ్యాపార, ఉపాధి పథకాల్లో చక్కని ప్రణాళికలు రూపొందిస్తారు. 
 
వృషభం: ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. వాయిదాపడిన పనులు అనుకోకుండా పూర్తి చేస్తారు. చిట్స్, ఫైనాన్సు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. మీ శక్తి సామర్ధ్యాలను తక్కువ అంచనా వేసుకోవద్దు. 
 
మిధునం: ఆర్ధిక విషయాలలో ఒకడుగు ముందుకు వేస్తారు. స్త్రీలకు పనివారలతో ఒత్తడి, చికాకులను ఎదుర్కుంటారు. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల, అపరిచితుల పట్ల మెళుకువ అవసరం. కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. తొందరపాటు నిర్ణయాల వల్ల వ్యవహారం బెడిసి కొట్టే ఆస్కారం ఉంది. 
 
కర్కాటకం: కంది, మినుము, మిర్చి వ్యాపారస్తులకు పురోభివృద్ధి. తలపెట్టిన పనుల్లో జాప్యం, ఒత్తిడి ఎదుర్కుంటారు. షాపుల అలంకరణ, కొత్త స్కీములతో విక్రయాలు పెరిగే సూచనలున్నాయి. దంపతుల మధ్య చిన్న చిన్న కలహాలు ఏర్పడతాయి. శస్త్రచికిత్సల సమయంలో డాక్టర్లకు ఏకాగ్రత, మెళుకువ అవసరం.
 
సింహం: బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు, రాతపరీక్షలలో మెళకువ అవసరం. స్త్రీలకు టి.వి ఛానెళ్ళకు సంబంధ బాంధవ్యాలు బలపడతాయి.
 
కన్య: స్ధిరాస్తి కొనుగోలు లేదా అభివృద్ధి దిశగా మీ ఆలోచనలుంటాయి. ఉద్యోగస్తులకు తోటివారి మాట ధోరణి ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. విద్యార్థులకు అతి ఉత్సాహం వల్ల సమస్యలు తలెత్తుతాయి.
 
తుల: నిత్యావసర వస్తు స్టాకిస్టులు కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించండి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి శ్రమాధిక్యత మినహా ఆశించిన ఫలితాలుండవు. అధిక మొత్తంలో ఋణం చేయవలసివస్తుంది. పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు.
 
వృశ్చికం: రాజకీయ నాయకులకు కార్యక్రమాలు వాయిదా పడతాయి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మిశ్రమ ఫలితం. మీ గౌరవానికి భంగం కలిగించే సంఘటనలు మీకు ఎదురవుతాయి. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరి కొన్ని ఆందోళన కలిగిస్తాయి. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికమవుతుంది.
 
ధనస్సు: పాత మిత్రుల కలయిక గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. సహచరుల సలహావల్ల నిరుద్యోగులు సదవకాశాలు జారవిడుచుకుంటారు. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఆశాజనకం. ఒక్కసారి ప్రేమిస్తే దాన్ని నిలబెట్టుకొవడానికి ఎంతైనా పోరాడతారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు.
 
మకరం: స్త్రీలకు కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదురవుతాయి. ఉపాధ్యాయులకు బదిలీ సమాచారం సంతృప్తి నిస్తుంది. ఉద్యోగస్తులకు రావలసిన క్లయింలు, అలవెన్సులు మంజూరవుతాయి. రుణయత్నాలు, చేబదుళ్ళు స్వీకరించవలసి వస్తుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.
 
కుంభం: ఆదాయం పెరిగి సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. వైద్యులకు ఏకాగ్రత, మెళుకువ అవసరం. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. పనిచేసే చోట అధికారులు మీ సామర్ధ్యాన్ని గుర్తిస్తారు. మీ శ్రీవారు మీతో ఆసక్తికరమైన విషయాలు చర్చిస్తారు. దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాలు వాయిదాపడతాయి. 
 
మీనం: ఆర్థిక విషయాలలో మీ లెక్కలు తారుమారు కాగలవు. రాజకీయనాయకులు తరుచు సభ, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. విదేశాలు వెళ్ళటానికి చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు మరింత బలపడతాయి.