శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శనివారం, 24 ఆగస్టు 2019 (14:03 IST)

24-08-2019- శనివారం మీ రాశి ఫలితాలు

మేషం: డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. బ్యాంకు వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. పత్రిక, వార్తా సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. స్త్రీలకు పనివారాలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఏ వ్యక్తినీ అతిగా విశ్వసించటం మంచిది కాదు. 
 
వృషభం: హోటల్, తినుబండారాలు, పండ్ల, పూల, కూరగాయాల వ్యాపారులకు పురోభివృద్ధి. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ లక్ష్యం నెరవేరుతుంది. ఉద్యోగస్తులు అధికారుల మెప్పుకోసం శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కుంటారు. వైద్యరంగాల వారికి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. దూర ప్రయాణాలలో ఇబ్బందులు తప్పవు. 
 
మిధునం: ఆర్ధికంగా ఎదగటానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి రాగలవు. రాజకీయ రంగంలోని వారికి ఆరోగ్యలోపం, అధికశ్రమ ఉంటాయి. సోదరీ, సోదరులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. సంఘంలో మీ మాటకు, గౌరవ మర్యాదలు లభిస్తాయి. పాత మిత్రుల కలయిక కొత్త ఉత్సాహాన్నిస్తుంది.
 
కర్కాటకం: వస్త్రములు, ఆభరణాలు, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు నెరవేరుతాయి. ఆపత్సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. కొత్తగా చేపట్టే వ్యాపారాల గురించి ఒక నిర్ణయానికి వస్తారు. తలపెట్టిన పనులు అర్థాంగా ముగిస్తారు. ఉద్యోగస్తులు తోటివారి కారణంగా అధికారులతో మాటపడకతప్పదు.
 
సింహం: ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ఉద్యోగస్తుల శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. సొంతంగా వ్యాపారం చేయాలనే దృక్పథం బలపడుతుంది.
 
కన్య: వ్యాపారాభివృద్ధికి చేయు కృషి ఫలిస్తుంది. వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. నిరుద్యోగుల లక్ష్య సాధనకు నిరంతర కృషి అవసరమని గమనించండి. ప్రైవేటు సంస్థల్లో వారు అధికారులతో సంభాషించేటపుడు మెళుకువ అవసరం. కోర్టు వ్యవహారాల్లో అనకూలత. విద్యార్థులు ఒత్తిడి, భయాందోళనలకు గురవుతారు.
 
తుల: ఆర్ధిక విషయాల్లో కొంత మేరకు పురోగతి సాధిస్తారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. కోర్టు వ్యవహారాలు, ఆస్తి వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. పాత రుణాలు తీర్చడంతో పాటు విలువైన పరికరాలు అమర్చుకుంటారు. ఖర్చలు అధికం కావటంతో ఒకింత ఇబ్బందులు తప్పవు.
 
వృశ్చికం: స్త్రీలు దంతాలు, నరాలకు సంబంధించిన చికాకులెదుర్కోవలసి వస్తుంది. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం మంచిది. స్టేషనరీ రంగాలలో వారికి పనిభారం అధికమవుతుంది. సహోద్యోగులతో సభ, సమావేశాలలో పాల్గొంటారు. ఉమ్మడి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.  
 
ధనస్సు: ఉద్యోగస్తులకు అధికారులతో చికాకులు తప్పవు. స్త్రీలతో మితంగా సంభాషించడం మంచిది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. గృహంలో మార్పులకిది అనువైన సమయమని గుర్తించండి. ఆత్మీయుల కలయిక సంతృప్తినిస్తుంది. పెద్దల ఆరోగ్యములో మెళకువ అవసరం.
 
మకరం: ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి దోహదం చేస్తాయి. దైవ, శుభకార్యాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. సంగీత, నృత్య కళాకారులకు సదవకాశాలు లభిస్తాయి. మీ సంతానం వైఖరి చికాకు పరుస్తుంది. బంధువులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ఉద్యోగం చేసే మహిళలకు చికాకులు తలెత్తుతాయి. 
 
కుంభం: వృత్తి వ్యాపారాల్లో ప్రతికూలతలెదురవుతాయి. దైవ, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆత్మీయుల కలయిక సంతృప్తిని ఇస్తుంది. ఖర్చులు పెరిగినా ఇబ్బందులే మాత్రం ఉండవు. పత్రిక, ప్రైవేటు సంస్ధల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. శ్రమాధిక్యత, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది.
 
మీనం: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. గత కొంత కాలంగా వేధిస్తున్న సమస్యలు సునాయాసంగా పరిష్కారమవుతాయి. విధినిర్వహణలో నిర్లక్ష్యం వల్ల ఉద్యోగస్తులు చిక్కుల్లో పడతారు.