శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : మంగళవారం, 20 ఆగస్టు 2019 (09:08 IST)

20-08-2019 మంగళవారం మీ రాశిఫలాలు - అపరిచిత వ్యక్తులపట్ల...

మేషం: హోటల్, క్యాటరింగ్ పనివారలకు సదవకాశాలు లభిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు తోటివారి వల్ల చికాకులు తప్పవు. మిత్రులను కలుసుకుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
 
వృషభం: ఆర్థిక, కుటుంబ సమస్యలు పరిష్కారమయ్యే సూచనలున్నాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోని వారికి కలిసివస్తుంది. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఆత్మీయులకు మీ సమస్యలు చెప్పుకోవడం వల్ల ప్రయోజనం ఉంది. ప్రయత్నపూర్వకంగా పాత బాకీలు వసూలు కాగలవు.
 
మిధునం: స్త్రీలకు కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకు లెదుర్కోవలసివస్తుంది. రాబడికి మించిన ఖర్చులున్నా మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. దీర్ఘకాలిక పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ఆపత్సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. 
 
కర్కాటకం: ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు వాయిదా పడుట వల్ల నిరుత్సాహానికి గురౌతారు. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. దంపతుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. ఉపాధ్యాయులకు పనిభారం, చికాకులు అధికమవుతాయి. అదనపు రాబడి కోసం యత్నాలు సాగిస్తారు.
 
సింహం: ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. ఉన్నతస్థాయి అధికారులకు అపరిచిత వ్యక్తులపట్ల అప్రమత్తత అవసరం. ఆలయాలను సందర్శిస్తారు. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. వస్త్ర, ఫ్యాన్సీ, పచారి వ్యాపారులకు పురోభివృద్ధి. మీ సమర్థత, వాక్చాతుర్యం ఎదుటి వారిని ఆకట్టుకుంటారు.
 
కన్య: వృత్తి ఉద్యోగాల్లో కొంత పురోగతి ఉంటుంది. దైవ సేవా కార్య క్రమాలలో పాల్గొంటారు. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. నిరుద్యోగ యత్నాలు కలిసివస్తాయి. వాహన చోదకులకు ఊహించని చికాకు లెదుర్కోవలసి వస్తుంది. బ్యాంకు చెక్కులు ఇచ్చే విషయంలో పునరాలోచన మంచిది.
 
తుల: కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు పురోభివృద్ధి. స్త్రీలు ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహ నిర్మాణ ప్లాను ఆమోదం పొందంటంతో పాటు రుణాలు అనుకూలిస్తాయి. రిప్రజెంటేటివ్‌లు, ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. మీ చిన్నారుల భవిష్యత్ గురించి తగు శ్రద్ధ తీసుకుంటారు. 
 
వృశ్చికం: ఆర్థిక విషయాల్లో ఇతరుల సలహా తీసుకోవటం మంచిది. దంపతుల మధ్య ప్రేమాను బంధాలు బలపడతాయి. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు మునుముందు మంచి ఫలితాలు నిస్తాయి. ఇతరుల వ్యాఖ్యలు మీ పై తీవ్ర ప్రభావం చూపుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. 
 
ధనస్సు: బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. మీ సంతానానికి ఇంజనీరింగ్, టెక్నికల్ కోర్సులలో అవకాశం లభస్తుంది. కష్టసమయంలో అయిన వారే ముఖం చాటేస్తారు. ఒక భారం దించుకున్న తరువాతనే కొత్త పనులు చేపట్టటం మంచిది.
 
మకరం: మీ శ్రీమతి ప్రోత్సాహంతో ఒక శుభకార్యానికి యత్నాలు మొదలెడతారు. హోటల్, తినుబండారాలు, బేకరీ పనివారలకు సామాన్యం. ఖర్చులు అధికమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఎదుటివారిని సలహా అడగటం మంచిదని గమనించండి. మీ పనులు మీరే స్వయంగా చూసుకోవడం శ్రేయస్కరం.
 
కుంభం: తలపెట్టిన పనులలో ఒత్తిడి, జాప్యం వంటి చికాకులు ఎదుర్కుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధిమవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. సాంఘీక, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలకు పనిభారం అధికం. పత్రిక, ప్రైవేటు సంస్ధలలోని వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. 
 
మీనం: ఆస్థి వ్యవహారాల్లో ముఖ్యులతో విభేధాలు తలెత్తుతాయి. విద్యార్ధులకు మిత్రబృందాలు, వ్యాపకాలు అధికం కాగలవు. ఏదైనా వ్యపారం చేయాలనే మీ ఆలోచన కొంత కాలం వాయిదా వేయటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో సానుకూలత లుంటాయి. ప్రియతములు ఇచ్చే సలహా మీకు ఎంతో సంతృప్తి నిస్తుంది.