శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

24-07-2020 శుక్రవారం రాశిఫలాలు - గృహంలో మార్పులు, చేర్పులు..

మేషం : ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. బంధు మిత్రులకు మీపై అభిమానం పెరుగుతుంది. అతిగా వ్యవహరించడం వల్ల కలహాలు, మనస్పర్థలు వంటివి ఎదుర్కోక తప్పదు. స్త్రీల మనోవాంఛలు నెరవేరగలవు. కొత్త వస్తువులు, వాహనం అమర్చుకుంటారు. గృహంలో మార్పులు, చేర్పులు ఒకంతట కార్యరూపం దాల్చకపోవచ్చు. 
 
వృషభం : బ్యాంకింగ్ రంగాల వారికి ప్రముఖుల నుంచి ఒత్తిడి, అధికారుల నుంచి చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. అకాల భోజనం, శారీరక శ్రమవంటి ఇబ్బందు లెదుర్కొంటారు. స్త్రీలకు, వస్త్రప్రాప్తి, ఆహ్వానాలు, విందులు వంటి శుభపరిణామాలున్నాయి. ప్రేమికుల తొందరపాటు నిర్ణయాలు కొత్త సమస్యలకు దారితీయవచ్చు. 
 
మిథునం : ఉద్యోగస్తులు శక్తివంచన లేకుండా శ్రమించి అధికారులను మెప్పిస్తారు. వాదోపవాదాలకు, హమీలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. మీ సంతానానికి కోరుకున్న విద్యావకాశాలు లభిస్తాయి. వైద్యులకు ఆపరేషన్లు విజయంవంతంగా పూర్తిచేస్తారు. రావలసిన ధనం చేతికందటంతో మీలో లు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. 
 
కర్కాటకం : మీ పనులు, కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. ప్రత్యర్థుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. కోర్టు వ్యవహారాలు, భూవివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. కళ, కీడా, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. 
 
సింహం : ఆస్తి వ్యవహారాలకు సంబంధించి సోదరీ సోదరులతో ఒక అవగాహనకు వస్తారు. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు కలిసిరాగలదు. వాహనం నడుపుతున్నపుడు జాగ్రత్త అవసరం. ఖర్చులు అధికం. రూణాలు, చేబదుళ్లు తప్పక పోవచ్చు. నిరుద్యోగులు, వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు సదావకాశాలు లభిస్తాయి. 
 
కన్య : తరచూ విందులు, సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కుటుంబీకులు, పెద్దల ఆరోగ్యంలో శ్రద్ధ అవసరం. స్త్రీల సరదాలు, అవసరాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. సంఘంలో పలుకుబడిగల వ్యక్తులతో పరిచయాలు, తరచూ వారితో సంప్రదింపులు వంటి పరిణామలు ఉంటాయి. 
 
తుల : వస్త్రాలు, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ అధికారుల నుంచి అభ్యంతరాలెదురవుతాయి. ఉద్యోగస్తులు పైఅధికారుల మన్ననలు పొందాతారు. దుబార ఖర్చులు అధికమవుతాయి. రుణాలు, చేబదుళ్లు తప్పకపోవచ్చు. విద్యార్థులకు నూతన పరిచయాలు ఏర్పడతాయి. 
 
వృశ్చికం : నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది. మీ సంతానానికి కోరుకున్న విద్యావకాశాలు లభిస్తాయి. మిత్రులు సహకారంతో చోటు చేసుకుంటుంది. మీ మాటకు సంఘంలో గౌరవం లభిస్తుంది. రుణ యత్నాలు ఫలిస్తాయి. మిత్రులు సహకారంతో ఒక సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు. 
 
ధనస్సు : స్త్రీలకు మొహమ్మాటాలు, ఒత్తిళ్లు అధికమవుతాయి. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వృత్తులు, క్యాటరింగ్, పనివారలకు సామాన్యం. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు.
 
మకరం : వృత్తులు, నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. లీజు, ఏజెన్సీలు, కాంట్రాక్టుల గురించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం అధికం. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి సోదరీ, సోదరులతో ఒక అవగాహనకు వస్తారు.
 
కుంభం : ప్రింటింగ్ రంగాల వారి ఆదాయం అంతం మాత్రంగానే ఉంటుంది. క్రయ విక్రయాలు సామాన్యం. దైవ, పుణ్యకార్యాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. కళ, క్రీడా, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు.
 
మీనం : వ్యాపారభివృద్ధికి చేయు కృషి, సత్ఫలితాలనిస్తుంది. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారం సంతృప్తినిస్తుంది. ఏమరుపాటుగా వాహనం నడపటం వల్ల ఊహించని సమస్యలు తలెత్తుతాయి. రాబడికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. కుంటుబీకులతో అవగాహన లోపిస్తుంది. చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు.