శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

20-07-2020 సోమవారం రాశిఫలాలు - రాజకీయాలలోని వారు ఆచితూచి..

మేషం : రాజకీయాలలోని వారు ఆచితూచి వ్యవహరించవలెను. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగాలలో వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి. కష్టసమయంలో సన్నిహితులు అండగా నిలుస్తారు. 
 
వృషభం : ఆర్థిక వ్యవహారాలు గోప్యంగా ఉంచడం క్షేమదాయకం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన మంచిది. పాత బిల్లులు చెల్లిస్తారు. నూతన దంపతులకు ఎడబాటు తప్పదు. ఉద్యోగస్తులు తోటివారితో సమావేశాలలో పాల్గొంటారు. కుటుంబీకులు ఉల్లాసంగా గడుపుతారు. 
 
మిథునం : ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. పత్రిక, వార్తా సంస్థలలోని వారికి ఓర్పు అవసరం. ఆకస్మిక ఖర్చులు, చెల్లింపుల వల్ల ఆటుపోట్లు తప్పవు. సోదరీ, సోదరుల కలయిక పరస్పర అవగాహన కుదురును. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. 
 
కర్కాటకం : బ్యాంకు పనులు నెమ్మదిగా సాగుతాయి. అలౌకిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. స్త్రీలు, విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. ఊహించని ఖర్చులు అధికమవుతాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికి, కంప్యూటర్ రంగాల్లో వారికి శ్రమాధిక్యత తప్పదు. 
 
సింహం : ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలను తెచ్చుకోకండి. స్త్రీల ఆరోగ్యంలో తగు జాగ్రత్త అవసరం. వైద్యులకు ఆపరేషన్ల సమయంలో జాగ్రత్త అవసరం. భాగస్వామిక రంగంలో వారికి చికాకులు తలెత్తును. మీరు సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కొంతకాలం వాయిదా వేయడం మంచిది. 
 
కన్య : ఉద్యోగస్తులు, తరచూ సభ, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సలహా పాటిస్తారు. బ్యాంకింగ్ వ్యవహారాలు, ప్రయాణాలలో మెళకువ వహించండి. ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. విద్యార్థులకు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. 
 
తుల : హోటల్, తినుబండారాల వ్యాపారస్తులకు లాభదాయకం. దైవ, పుణ్య కార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. అనుకున్న పనులలో ఆటంకాలు ఎదురైనా మొండిధైర్యంతో ముందుకుసాగి పూర్తిచేస్తారు. అనుకూలమైన కాలం. ప్రముఖులను కలుసుకుంటారు కుటుంబీకులతో చికాకులు ఎదుర్కొనక తప్పదు. వృత్తి వ్యాపారాల్లో మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు పై అధికారులతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. 
 
ధనస్సు : కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో మెళకువ అవసరం. విద్యార్థులకు గత అనభవాలు జ్ఞప్తికి వస్తాయి. రావలసిన మొండిబాకీలు వాయిదాపడతాయి. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, తిప్పటతప్పదు. స్త్రీలకు ఏ విషయంలోనూ మనస్థిమితం అంతగా ఉండదు. ఉద్యోగరీత్యా ప్రయాణం చేయవలసి వస్తుంది. 
 
మకరం : బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. స్త్రీలకు పనివారితో చికాకులను ఎదుర్కొంటారు. చేపట్టిన పనులలో అవాంతరాలు ఎదురైనా మొండి దైర్యంతో శ్రమిచి, పూర్తి చేస్తారు. ధనాన్ని మంచి నీళ్ళ ప్రాయంగా ఖర్చు చేస్తారు. నూతన దంపతుల మధ్య కొత్త కొత్త ఆలోచలు స్ఫురిస్తాయి. 
 
కుంభం : దైవ, సేవా, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. గతంలో నిలిచిపోయిన కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తారు. నిత్యావసర సరకుల స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. రాజకీయ నాయకులు సభ, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. 
 
మీనం : ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చు తప్పులు పడటం వల్ల మాటపడతారు. గృహంలో మార్పులు, చేర్పులు అనుకున్నంత సంతృప్తినివ్వవు. స్త్రీలు అపరిచిత వ్యక్తులతో అధికంగా సంభాషించడం మంచిదికాదు అని గమనించండి. ఐరన్ రంగాల వారికి ఆటంకం తప్పదు.