సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : ఆదివారం, 19 జులై 2020 (10:03 IST)

19-07-2020 ఆదివారం మీ రాశి ఫలితాలు- స్వతంత్ర్య నిర్ణయాలతో శుభాలే..! (Video)

Daily Horoscope
మేషం: మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పెంపొందుతాయి. మిత్రులతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. రుణాలు, పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తారు.
 
వృషభం: ఈ రోజు కొన్ని అవాంతరాలు ఎదుర్కొంటారు. క్రయ విక్రయ రంగాల వారికి మెళకువ అవసరం. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. ఎంత కష్టమైన పనైనా అవలీలగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మికం విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
మిథునం: కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. పాత మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. స్వతంత్ర్య నిర్ణయాలు చేసుకోవడం వలన శుభాలు చేకూరుతాయి. శ్రీవారు, శ్రీమతి మధ్య గతంలో ఏర్పడిన అభిప్రాయబేధాలు తొలగిపోతాయి. క్లిష్టమైన సమస్యలు తలెత్తినా సమర్థతతో ఎదుర్కొంటారు.
 
కర్కాటకం: స్త్రీలకు సంపాదనపై ఆసక్తి పెరుగుతుంది. మీ సంతానం కోసం, ప్రియతముల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. వృత్తులు, చిన్న తరహా పరిశ్రమలకు కలిసిరాగలదు. పెరిగిన కుటుంబ అవసరాలు రాబడికి మించిన ఖర్చుల వల్ల ఆటుపోట్లు తప్పవు. దూర ప్రయాణాలు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.
 
సింహం: రిప్రజెంటేటివ్‌లకు మార్పుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయాల్లో వారికి ఊహించని అవరోధాలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఇతర ఒప్పందాలు అనుకూలిస్తాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు.
 
కన్య: ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన ప్రయోజనాలు సాధించడం కష్టం. విద్యుత్ రంగాల వారు ఒత్తిడి, చికాకులు వంటివి ఎదుర్కొంటారు. మీ ముఖ్యుల కోసం ధనం బాగా వెచ్చించాల్సి వుంటుంది. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. స్త్రీల ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
తుల: పెద్దలను ప్రముఖులను కలుసుకోగలుగుతారు. స్త్రీలు కలుపుగోలుగా వ్యవహరించి అందిరిని ఆకట్టుకుంటారు. అందరితో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో శ్రమకు నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. రుణ ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగిపోతాయి.
 
వృశ్చికం: ఇతరుల విషయాలకు వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది. దూర ప్రయాణాలు సంతృప్తినిస్తాయి. ఖర్చులు పెరిగినా సమయానికి కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. ఒక ముఖ్య విషయమై న్యాయ సలహా పొందుతారు. చేపట్టిన పనులు కొంత ముందు వెనుకలుగానైనా  సంతృప్తికరంగా పూర్తి కాగలవు.
 
ధనస్సు: పాత వస్తువులను కొని సమస్యలు తెచ్చుకోకండి. చిట్స్, ఫైనాన్స్, వ్యాపారస్తులకు ఖాతాదారులతో సమస్యలు తప్పవు. కొబ్బరి, పండ్ల, పూల, బేకరీ వ్యాపారులకు సామాన్యంగా వుంటుంది. మీ అశ్రద్ధ, ఆలస్యం వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ఏ యత్నం కలిసిరాకపోవడంతో ఒకింత నిరుత్సాహం తప్పదు.
 
మకరం: బంధువులతో తెగిపోయిన సంబంధాలు తిరిగి బలపడతాయి. కాంట్రాక్టుదారులకు ఆందోళనలు కొన్ని సందర్భాల్లో ధననష్టము సంభవిస్తుంది. స్త్రీల సృజనాత్మకతకు తగిన గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. సభలు, సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు.
 
కుంభం: ఓర్పు, పట్టుదలతో శ్రమిస్తే కానీ పనులు నెరవేరవు. ఉమ్మడి వ్యాపరాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తినిస్తాయి. సోదరీ సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. దైవ, పుణ్యకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. నిరుద్యోగులు బోగస్ ప్రకటనలు పట్ల అప్రమత్తంగా వ్యవహరించాల్సి వుంటుంది.
 
మీనం: ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికం. విద్యా సంస్థల వారికి ఆందోళన తప్పదు. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. రుణయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులు నిరుత్సాహానికి గురవుతారు. వ్యవసాయ రంగాల వారికి అన్ని విధాలా అనుకూలం. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు.