17-07-2020 శుక్రవారం రాశిఫలాలు - నిరుద్యోగులు భేషజాలకు...

astro 6th
రామన్|
మేషం : పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సాహసోపేతమైన నిర్ణయాలు సత్ఫలితాలిస్తాయి. రాబడికి మంచిన ఖర్చులెదురైనా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. సోదరుల నుంచి మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.

వృషభం : ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఏకాగ్రత చాలా అవసరం. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పంతం అధికమవుతుంది. విద్యార్థులకు రెండో విడత కౌన్సెలింగ్‌లో ఉన్నత విద్యావకాశాలు లభించే ఆస్కారం ఉంది. ప్రముఖుల కలయిక వాయిదాపడుతుంది. వైద్యులకు మెళకువ, ఏకాగ్రత చాలా అవసరం.

మిథునం : సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులెదురవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఇతరులపై ఆధారపడక స్వశక్తితోనే మీ పనులు పూర్తి చేసుకోవడం మంచిది. వ్యాపారాభివృద్ధికి నూతన పథకాలు ప్రణాళికలు చేపడతారు. ఆకస్మికంగా దూర ప్రయాణాల్లో తొందరపాటుతనం అంత మంచిదికాదని గమనించండి.

కర్కాటకం : వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. ఉపాధ్యాయులు చర్చలు, సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు తప్పవు. హోటల్, తినుబండారాలు, వ్యాపారులకు క్యాటరింగ్ పనివారలకు కలిసివస్తుంది. తలపెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహనం ఎదుర్కొంటారు.

సింహం : స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి లభించే అవకాశం ఉంది. పాత రుణాలు తీరుస్తారు. కుటుంబీకుల ఆరోగ్యం మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. స్థిరచరాస్విషయంలో ఏకీభావం కుదరదు. మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రముఖుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది.

: ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. ఇతరులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. విద్యా సంస్థల వారికి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి.

తుల : ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన బంధువుల సహాయంతో సమసిపోగలవు. ప్రభుత్వ కార్యలయాల్లో మీ పనుల సానుకూలమవుతాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ శ్రీమతి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. రాజకీయాల్లో వారికి సంక్షోభం తప్పదు. బంధు మిత్రులను కలుసుకుంటారు.

వృశ్చికం : గృహమునకు కావలసిన వస్తువులు అమర్చుకోగలుగుతారు. దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. ఎల్.ఐ.సి, బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ధనం అందుతుంది. ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు రుణాలు తీరుస్తారు. మీ సంకల్పానికి నిరంతర శ్రమ, పట్టుదల చాలా అవసరమని గమనించండి.

ధనస్సు : స్త్రీలకు అకాల భోజనం, శారీరక శ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. చేపట్టిన పనులు వేగవంతమవుతాయి. మీ చిన్నారుల కోసం నూతన పథకాలు వేసి జయం పొందగలుగుతారు. ఉద్యోగస్తులు దైనందిన కార్యక్రమాలు యాధివిధిగా సాగుతాయి. రియల ఎస్టేట్ రంగాల రంగంలోని వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు.

మకరం : ప్రైవేటు రంగాల్లో వారికి ఒక ప్రకటన ఎంతో ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులకు చేతిదాగా వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. రసాయన, ఆల్కహాల్, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు అధికారుల వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లకు ఒత్తిడి, చికాకులు తప్పవు.

కుంభం : అందరినీ అతిగా నమ్మే మీ స్వభావం ఇబ్బందులకు దారితీస్తుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు, నిరుత్సాహం కలిగిస్తుంది. రాజకీయాలలోని వారికి ప్రయాణాలో మెళకువ అవసరం. దుబారా ఖర్చులు నివారించడం సాధ్యపడక పోవచ్చు. స్త్రీలకు బంధుమిత్రులతో మనస్పర్థలు తలెత్తుతాయి.

మీనం : దైవ, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సోదరీ, సోదరుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం. నూతన వ్యక్తులతో స్నేహం ఏర్పడుతుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీనిపై మరింత చదవండి :