మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By ఠాగూర్

14-07-2020 మంగళవారం రాశిఫలాలు - స్త్రీలకు పనిభారం వల్ల...

మేషం : బ్యాంకింగ్ వ్యవహారాలపట్ల అప్రమత్తత అవసరం. స్త్రీలకు పనిభారం వల్ల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒత్తిడి తప్పదు. చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గుడుపుతారు. ఇంట్లో మార్పులు, మార్పులు చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. విద్యార్థులకు చదువుల పట్ల ఏకాగ్రత ఎంతో ముఖ్యం. 
 
వృషభం : రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒత్తిడి తప్పదు. ఒంటరిగానే లక్ష్యాలను సాధిస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. దంపతుల మధ్య మనస్పర్థలు తొలగిపోతాయి. వృత్తులలో వారికి చికాకులు, వైద్యులకు లాభదాయకం. ఆడిటర్లకు మిశ్రమ ఫలితం. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. 
 
మిథునం : దూరపు బంధువుల ప్రోత్సహంతో పనులలో పురోభివృద్ధిని సాధిస్తారు. మీ వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. పాత రుణాలు తీరుస్తారు. సమావేశాలకు ఏర్పాటు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఒక ఖర్చు నిమిత్తం తెచ్చిన ధనం మరొక అవసరానికి వినియోగిస్తారు. 
 
కర్కాటకం : మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. కొబ్బరి, పండ్లు, పూల, పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఆహార వ్యవహారాల్లో మెళకువ వహించండి. క్రయ, విక్రయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. పెద్దలతో సోదరీ, సోదరుల విషయాలు చర్చకు వస్తాయి. నిరుద్యోగులు ప్రోత్సాహకరమైన వార్తలు వింటారు. 
 
సింహం : నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు కలిసిరాగలదు. రుణ విముక్తులు కావడంతోపాటు రుణాలు అనుకూలిస్తాయి. కుటుంబ పరిస్థితులు క్రమేణా మెరుగుపడుతాయి. క్రీడల పట్ల ఆసక్తి చూపిస్తారు. వాహన చోదకులకు ఏకాగ్రత అవసరం. దైవ, సేవా, సాంఘిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. 
 
కన్య : మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు. ఇరుగు, పొరుగు వారి మధ్య కలహాలు అధికమవుతాయి. హోటల్, తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. భూమి, ఇండ్ల వ్యాపారులకు ప్రభుత్వ రీత్యా ధనము అదాయం బాగుండును. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తి సాగుతాయి. హామీలు, మధ్యవర్తిత్వాలు ఇబ్బంది కలిగిస్తాయి. 
 
తుల : ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతుంది. స్థిరచరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. కొన్ని సమస్యలు పరిష్కరించలేనంత జటిలమై చికాకు పుట్టిస్తారు. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. స్థిరాస్తికి సంబంధించిన విషయాలు ఒక కొలిక్కివస్తాయి. 
 
వృశ్చికం : కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయకం. కుటుంబ విషయాల్లో గతానుభవం ఉపయోగపడుతుంది. మార్కెట్ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. విదేశాల నుంచి ప్రత్యేక విషయాలు విని సంతోషిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. ప్రయాణాల్లో ఒత్తిడి చికాకులను ఎదుర్కొంటారు.
 
ధనస్సు : రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు ఆందోళన అధికమవుతుంది. భాగస్వామ్య చర్చల్లో కొన్ని అవరోధాలు తలెత్తుతాయి. జాగ్రత్త వహించండి. కుటుంబ సౌఖ్యం కొంత తక్కువని చెప్పొచ్చు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత, సహనం ఎంతో ముఖ్యం. స్త్రీల మాటకు వ్యతిరేకత, కుటుంబంలో చికాకులు ఎదురవుతాయి. 
 
మకరం : వృత్తుల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేకపోతారు. 
 
కుంభం : అపరాలు, ధాన్య స్టాకిస్టులకు జాగ్రత్త అవసరం. సేవా సంస్థలకు విరాళిలివ్వడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి కార్మిక సమస్యలు తలెత్తుతాయి. కంప్యూటర్, ఎలక్ట్రానికల్, టెక్నికల్ రంగాలలో వారికి కలిసివస్తుంది. పనివారలతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
మీనం : ఆర్థిక విషయాలలో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. క్రీడా, కార్యక్రమాల పట్ల ఆసక్తి అధికమవుతుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. స్త్రీల కళాత్మతకు, ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి.