సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

11-07-2020 శనివారం రాశిఫలాలు - ఉద్యోగస్తులు ప్రలోభాలకు లొంగవద్దు...

మేషం : విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. ఉద్యోగస్తులు ప్రలోభాలకు లొంగవద్దు. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ఒక అనుభవం మీకెంతే జ్ఞానాన్ని ఇస్తుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. 
 
వృషభం : ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ప్రయాణాలు, బ్యాంకు వ్యవహారాల్లో ఏకాగ్ర వహించండి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లోనూ, వస్తు నాణ్యతలోనూ మెలకువ అవసరం. రిజిస్ట్రేషన్ వ్యవహారాలు వాయిదాపడటం మంచిది. 
 
మిథునం : ఇష్టం లేకున్నా కొన్ని విషయాల్లో సర్దుకుపోవలసి ఉంటుంది. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికమవుతుంది. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. విద్యార్థులకు మెడికల్, ఇంజనీరింగ్ టెక్నికల్ కోర్సులలో ప్రవేశం లభిస్తుంది. ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల చికాకులు తప్పవు. 
 
కర్కాటకం : పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం ఆందోళన కలిగిస్తుంది. ఏ యత్నం కలిసిరాకపోవడంతో నిరుద్యోగులు నిరుత్సాహానికి గురవుతారు. కొత్త పనులు చేపట్టకుడా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహించడి. వ్యవసాయ కూలీలు, ముఠా కార్మికులకుశ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. 
 
సింహం : రచయితలకు, కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. పారిశ్రామిక రంగంలోని వారికి కార్మికులతో సమస్యలు తప్పవు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. 
 
కన్య : ఆపరేషన్ల సమయంలో వైద్యులకు ఏకాగ్రత ముఖ్యం. ఉమ్మడి వ్యవహారాలు, ఆస్తి పంపకాలు పరిష్కార దిశగా సాగుతాయి. మీ రాక బంధువులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. 
 
తుల : వాతావరణంలో మార్పుతో స్వల్ప అస్వస్థతకు గురవుతారు. ఉన్నతస్థాయి అధికారులకు కింది స్థాయి సిబ్బందితో ఇబ్బందులు తప్పవు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని లావాదేవీలు అనుకూలించకపోవడంతో నిరుత్సాహం చెందుతారు. 
 
వృశ్చికం : దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. వాతావరణం మార్పుతో మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. మీ కార్యక్రమాలు, వ్యవహారాల్లో స్వల్ప మార్పులుంటాయి. ధనసహాయం, ఆదాయ వ్యయాల్లో ఏకాగ్రత వహించండి. ఖర్చులు అధికం. చేతిలో ధనం నిలవడం కష్టమే. 
 
ధనస్సు : సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఒక సమస్యను అధికమిస్తారు. ఇతరులు మీ దృష్టిని మరల్చేందుకు యత్నిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఒక వ్యవహారం నిమిత్తం ఫ్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. అసందర్భంగా మీరు చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీస్తాయి. 
 
మకరం : ఆర్థికంగా కొంత పురోగతి సాధిస్తారు. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత వహించండి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడర్లు గుమస్తాలకు చికాకులు తప్పవు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. పెద్దల ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉన్నా డబ్బుకు కొదవ ఉండదు. 
 
కుంభం : ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేయవలసి ఉంటుంది. చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు ఎదుర్కొంటారు. ఖర్చులు, చెల్లింపులకు సార్థకత ఉంటుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతుల్లో వ్యయం మీ అంచనాలను మించుతుంది. వ్యాపారాల అభివృద్ధికి కొత్త కొత్త పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. 
 
మీనం : కుటుంబీకుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. వాతావరణం అనుకూలించడంతో వ్యవసాయ పనులు ఊపందుకుంటాయి. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు ఉన్నత విద్యల కోసం దూర ప్రాంతాలకు వెళ్లవలసి ఉంటుంది. బంధువులపై మీరు పెట్టుకున్న ఆశలు అడియాశలు అవుతాయి.