గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : బుధవారం, 8 జులై 2020 (00:31 IST)

08-07-2020 బుధవారం రాశిఫలాలు (video)

మేషం : వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారులకు సంతృప్తి. పురోభివృద్ధి. స్త్రీలకు అయిన వారి ఆరోగ్యం కలవరపరుస్తుంది. అధికారుల హోదా పెరగడంతో పాటు స్థానచలనం ఉంటుంది. వ్యాపార ఉపాధి పథకాల్లో చక్కని ప్రణాళికలు రూపొందిస్తారు. ఆపద సమయంలో సన్నిహితుల అండగా నిలుస్తారు. 
 
వృషభం : వస్త్ర, చికిత్స చేయునపుడు వైద్యులకు మెళకువ అవసరం. కళా రంగాలలోని వారికి అనుకూలమైన కాలం. మీ సంతానం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. కోర్టు వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఉపాధ్యాయులకు ప్రోత్సాహం కానవస్తుంది. భేషజాలకు పోకుండా ఇతరుల సహాయాన్ని స్వీకరించండి. 
 
మిథునం : బ్యాంకు వ్యవహారాలు అనుకూలిస్తాయి. దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఏకాంతంగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు. క్రయ విక్రయదార్లకు అనుకూలంగా ఉండును. కుటుంబ సభ్యులతో స్వల్ విభేదాలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. స్త్రీల సరదాలు, అవసరాలు వాయిదావేసుకోవలసి వస్తుంది. 
 
కర్కాటకం : ఆర్థిక ఇబ్బంది అంటూ ఏది లేకపోయినా సంతృప్తికానరాదు. క్రీడా రంగంలో వారికి శుభదాయకం సాహిత్య సదస్సులలోనూ బృంద కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. స్వశక్తితో పైకొచ్చిన మీరు మరింత ముందుకెళ్లాలంటే తగిన సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. మీ అనుభవాలను ముఖ్యులతో పంచుకుంటారు. 
 
సింహం : ఉపాధ్యాయులకు ప్రోత్సాహం కానవస్తుంది. ఆనందకరమైన హృదయంతో ఎలాంటి పనిలోనైనా విజయాన్ని సాధించవచ్చన్న వాస్తవాన్ని గుర్తిస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, క్రమశిక్షణ ముఖ్యం. శత్రువుల సైతం మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. విదేశీయాన యత్నాలు కొంతవరకు అనుకూలించగలవు. 
 
కన్య : విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల చికాకులు, మందలింపులు తప్పవు. ఖర్చులు అధికమవుతాయి. గతంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకుని బాధడటం కంటే భవిష్యత్ గురించి ఆలోచించడం మంచిది. ఫ్లీడరు, ఫ్లీడరు గుమస్తాలకు ప్రోత్సాహం కానరాగలదు. విలువైన పత్రాలు, రశీదులు నోటీసులు అందుకుంటారు. 
 
తుల : ఆర్థిక వ్యవహారాలలో పురోభివృద్ధి. నూనె, ఎండుమిర్చి, బెల్లం, చింతపండు, వ్యాపారస్తులకు కలిసి వచ్చేకాలం. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొంటారు. ధనం నీళ్ళ ప్రాయంగా ఖర్చవుతుంది. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ముఖ్యుల నుండి వార్తలు అందుకుంటారు. 
 
వృశ్చికం : బంధువుల నుంచి మనస్పర్థలు తలెత్తుతాయి. ఖర్చులు అధికమవుతాయి. ప్రైవేటు సంస్థలలో వారు సహకారం సంఘాలలో వారు పనిలో ఏకాగ్రత వహించలేక పోవుట వల్ల అధికారులతో మాటపడవలసి వస్తుంది. స్పెక్యులేషన్ కలిసిరాదు. పోస్టల్ టెలిగ్రాఫ్ రంగాలలో వారికి పనిలో ఒత్తిడి, చికాకులు తప్పవు. 
 
ధనస్సు : వృత్తి వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం పొందుతారు. ఆలయాలను సందర్శిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. 
 
మకరం : చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు. లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టులు విషయంలో పునరాలోచన మంచిది. ఉద్యోగస్తులు అదనపు బాధ్యతల నుంచి విముక్తులవుతారు. కోర్టు వాదావవాదాల్లో ఫ్లీడర్లు రాణిస్తారు. పత్రికా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ప్రత్యర్థులు మీ శక్తి సామర్థ్యాలను గుర్తిస్తారు. 
 
కుంభం : స్త్రీలకు అయినవారి నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ప్రతి విషయంలోను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. చేపట్టిన పనులు హడావుడిగా ముగిస్తారు. రావలసిన ధనం అందక పోవడంతో ఒడిదుడుకులు తప్పువు. అవసరానికి సహకరించని బంధువుల తీరు మనస్తాపం కలిగిస్తుంది. 
 
మీనం : వడ్డీలు, డిపాజిట్లు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చిన్నతరహా పరిశ్రమలు చిరు వ్యాపారులకు లాభదాయకం. కోర్టు వ్యవహారాలు, భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. మిమ్మలను తక్కువ అంచనా వేసిన వారే మీ సమర్థతను గుర్తిస్తారు. నిరుద్యోగులకు ఆశాజనకం.