గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

03-07-2020 శుక్రవారం రాశిఫలాలు - దుర్గా దేవిని ఆరాధిస్తే....

మేషం : పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. ఉద్యోగస్తులు పైఅధికారులతో ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. ఒక స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. 
 
వృషభం : రహస్య విరోధులు అధికం కావడం వల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి వస్తుంది. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు. 
 
మిథునం : వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు, ఆటంకాలు ఎదుర్కొంటారు. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాలు వాయిదాపడును. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. రాజకీయ నాయకులు వాగ్ధాటితో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
కర్కాటకం : రవాణా రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. బంగారు వ్యాపారులకు అనుకోని సమస్యలు ఎదురవుతాయి. విదేశాల నుంచి ప్రత్యేక విషయాలు విని సంతోషిస్తారు. 
 
సింహం : విద్యుత్ రంగాలలో వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. రావలసిన ధనంలో కొంత మొత్తం వసూలు కాగలదు. దైవ దర్శనానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. భాగస్వామిక వ్యాపారాలు, ఉమ్మడి వెంచర్లు లాభసాటిగా సాగుతాయి. బంధువులను కలుసుకుంటారు. 
 
కన్య : కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పాత మిత్రుల కలయిక సంతోషాన్ని ఇస్తుంది. దంపతుల మధ్య అవగాహన కొరవడుతుంది. మీ చుట్టు పక్కల వారి ధోరణి మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. విజయం మిమ్మల్ని వరిస్తుంది. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ప్రింటింగ్ స్టేషనరీ రంగాల వారికి సామాన్యం. 
 
తుల : రాజకీయాల్లో వారికి సంక్షోభం తప్పదు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లలో చికాకులు తప్పవు. మీ సరదాలు, కోరికలు వాయిదావేసుకోవలసి వస్తుంది. ఆపరేషన్లు చేయునపుడు వైద్యులకు ఏకాగ్రత, మెళకువ అవసరం. ప్రింటింగ్ స్టేషనరీ రంగాలలో వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. 
 
వృశ్చికం : ఏసీ కూలర్, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. ఇసుక, క్వారీ, కాంట్రాక్టర్లకు అభ్యంతరాలు, చికాకులు తప్పవు. నిరుద్యోగులకు చేతిదాకా వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. ఇతరులకు ఇచ్చిన ధనం తిరిగి రాబట్టుకోవడం సాధ్యంకాదని గమనించండి. 
 
ధనస్సు : ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. మీ శ్రీమతి సలహాలు, సూచనలు పాటించడం క్షేమదాయకం. ఉపాధ్యాయులు చర్చలు, సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. అనుకున్న పనుల్లో చిన్న చిన్న ఆటంకాలెదురైనా సమసిపోగలవు. 
 
మకరం : ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్ ఆర్డరు చేతికందుతుంది. గృహంలో మార్పులు, చేర్పులు చేస్తారు. మీ ఉన్నతిని చాటుకోవాలనే ఉద్దేశ్యంతో ధనం విరివిగా వ్యయం చేస్తారు. పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి. కాంట్రాక్టర్లకు ఇబ్బటివరకు వాయిదాపడుతున్న పనులు తిరిగి ప్రారంభమవుతాయి. 
 
కుంభం : వృత్తి వ్యాపారాల్లో అనుకూలత వంటి శుభపరిణామాలు ఉంటాయి. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి లభించే అవకాశం ఉంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఏకాగ్రత చాలా అవసరం. దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాలలో ఇబ్బందులు తలెత్తుతాయి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
మీనం : ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. వస్త్ర, వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. ఉద్యోగస్తులకు ఊహించని అవరోధాలు తలెత్తినా తెలివితే పరిష్కరించగలుగుతారు. పెంపుడు జంతువులపై ప్రేమ శ్రద్ధ చూపిస్తారు.