మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : గురువారం, 2 జులై 2020 (09:46 IST)

02-07-2020 గురువారం రాశిఫలాలు (video)

మేషం : ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. షాపింగ్ వ్యవహారాల్లో చికాకులు తప్పవు. వాదోపవాదాలకు ఇది సరైన సమయం కాదని గ్రహించండి. కొబ్బరి, పండ్లు, పూల, తోటల వ్యాపారులకు లాభదాకయం. బంధువుల రాకతో స్త్రీలలో ఉత్సాహం చోటుచేసుకుంటుంది. 
 
వృషభం : శారీరక ఆరోగ్యం నందు కొద్దిపాటి మార్పులు వచ్చే సూచనలున్నాయి. కోర్టు పనులు, లిటిగేషన్లు పరిష్కారమవుతాయి. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. 
 
మిథునం : హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. ఉద్యోగస్తులు తొందరపాటుతనం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. విలాస వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు నెరవేరగలవు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశానంతత చేకూరుతుంది. చేపట్టిన పనులు అనుకోకుండా వాయిదాపడతాయి. 
 
కర్కాటకం : మీ ధ్యేయం నెరవేరాలంటే ఓర్పు, పట్టుదలతో శ్రమించవలసి ఉంటుంది. సంగీత సాహిత్యాభిలాష పెరుగుతుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి పనిభారం ఒత్తిడి అధికమవుతుంది. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలించవు. 
 
సింహం : రాలవసిన ధనం సమయానికి అందడం వల్ల ఆర్థిక సమస్య అంటూ ఏదీ ఉండదు. విద్యార్థినిలకు తోటివారి కారణంగా మాటపడవలసి వస్తుంది. ఇతరుల వాహనం నడిపేటపుడు మెళకువ అవసరం. దైవకార్యాల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. రాజకీయ నాయకులు, సాంఘిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కన్య : రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కిరాణా రంగంలోని వారికి శుభదాకయం. కోర్టు వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు ఒక కొలిక్కి రాగలవు. కొబ్బరి, పండ్లు, పూల, పానీయ వ్యాపారులకు ఆశాజనకం. కొన్ని విషయాల్లో మిత్రులు మిమ్మలన్ని శంకించేందుకు ఆస్కారం ఉంది. మెళకువ వహించండి. 
 
తుల : కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ట్రావెలింగ్, ట్రాన్స్‌పోర్టు రంగాల వారికి సామాన్యం. రాజకీయాల్లో వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఉపాధ్యాయులకు పనిభారం అధికం. 
 
వృశ్చికం : ఇతర దేశాలు వెళ్లడానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. పదవులు, సభ్యత్వాలకు స్వస్తి చెబుతారు. ఉద్యోగంలో శ్రమకు నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు యధావిధిగా సాగుతాయి. కంపెనీలకు అవసరమైన నిధులు సేకరణలో ఇబ్బందులు ఎదురవుతాయి. 
 
ధనస్సు : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. టెక్నికల్, సాంకేతిక రంగాలలో వారికి లాభదాకయం. దైవ కార్యాలలో చురుకుగా వ్యవహరిస్తారు. పెద్దల సహకారం లోపిస్తుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా నడుచుకుంటాయి. పెద్దల ఆరోగ్యంలో వైద్యుని సలహా తప్పదు. 
 
మకరం : సినిమా రంగాల్లో వారికి సంతృప్తికానవస్తుంది. ప్రైవేటు సంస్థలలోని వారి మార్పులకై చేయు యత్నాలలో జయం పొందుతారు. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు పనివారలతో సమస్యలు తప్పవు. ఆధ్యాత్మిక, అలౌకిక విషయాల పట్ల ఆసక్తి పెరుగును. విద్యార్థులకు చదువుల పట్ల ఏకాగ్రత ఎంతో ముఖ్యం. 
 
కుంభం : పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి చికాకులు, ఒత్తిడి తప్పదు. సాంఘిక కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార విషయముల యందు, ఉమ్మడి సమస్యలు తలెత్తవచ్చును. సోదరీ సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడుతాయి. 
 
మీనం : అనవసరపు విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ప్రముఖుల ప్రమేయంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలమవుతాయి. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంజనీరింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. బ్యాంకింగ్ రంగాల వారికి మెళకువ అవసరం.