సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

28-06-2020 ఆదివారం రాశిఫలాలు - సూర్యనారాయణ స్వామిని పూజిస్తే...

మేషం : వస్త్ర, స్టేషనరీ, ఫ్యాన్సీ, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. రావలసిన ధనం ఆలస్యంగా అందడం వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదు. పరుషమైన మాటలు సంబంధాలను దెబ్బతీస్తాయి. 
 
వృషభం : పట్టుదలతో శ్రమించి అనుకున్న పనులు పూర్తిచేస్తారు. మీ హోదాను చాటుకునేందుకు ధనం విరివిగా వ్యయం చేస్తారు. భాగస్వామిక ఒప్పందాల్లో సముచిత నిర్ణయం తీసుకుంటారు. నూతన పరిచయాలు సంబంధం బాంధవ్యాలు మెరుగుపడుతాయి.. ఉపాధ్యాయులకు ఊహించని వారి నుంచి సదావకాశాలు లభిస్తాయి. 
 
మిథునం : లౌక్యంగా వ్యవహరించి మీ సమాధానాన్ని దాటవేయండి. డాక్యుమెంట్లపై సంతకాలు పెట్టేముందు జాగ్రత్త అవసరం. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. ఉద్యోగస్తులు తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. అయినవారితో సంప్రదింపులు ఓ కొలిక్కి వస్తాయి. పెద్దల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. 
 
కర్కాటకం : ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. భాగస్వామిక ఒప్పందాల్లో సముచిత నిర్ణయం తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి లాభాలు అర్జిస్తారు. ఉపాధ్యాయులకు ఊహించని వారి నుంచి సదావకాశాలు లభిస్తాయి. 
 
సింహం : ముఖ్యుల కోసం షాపింగ్ చేస్తారు. స్త్రీలకు అకాల భోజనం వల్ల ఆరోగ్యంలో చికాకులను ఎదుర్కొంటారు. గృహమునకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయత్నపూర్వకంగా నిరుద్యోగులకు అవకాశం కలిసివస్తుంది. భాగస్వాముల మధ్య అవరోధాలు తలెత్తినా నెమ్మదిగా పరిష్కరిస్కరిస్తారు. 
 
కన్య : శ్రమపడినా ఫలితం దక్కించుకుంటారు. నిరుద్యోగులకు ఒక వార్త ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. మీ మనోభావాలు నెరవేరే సమయం ఆసన్నమయినది. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకెంతో శుభం చేకూరుతుందని గమనించండి. 
 
తుల : ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. తొందరపాటుతనం వల్ల ధననష్టం, అవకాశాలు వెనక్కిపోయే ఆస్కారం ఉంది మీ హోదాను చాటుకునేందుకు ధనం విరివిగా వ్యయం చేస్తారు. వైద్య రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. 
 
వృశ్చికం : రాజకీయాలలో వారు విరోధులు వేసే పథకాలను తెలివితే తిప్పిగొట్టగలుగుతారు. పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. అందరిలోనూ మంచి గుర్తింపు పొందుతారు. రేపటి గురించి ఆలోచనలు సాగిస్తారు. పాత రుణాలు తీరుస్తారు. మీ వాహనం ఇతరులకివ్వడం వల్ల కొత్త సమస్య లెదుర్కోవలసి వస్తుంది. 
 
ధనస్సు : రాజకీయాలలో వారికి సంఘంలో  స్థాయి పెరుగును. వృత్తి వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి ఏమాత్రం కొదవ ఉండదు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వసతి ఏర్పాట్ల విషయంలో చికాకులు ఎదురవుతాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సివస్తుంది. 
 
మకరం : ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. మీ సంతానం వైఖరి మీకు ఎంతో ఆదోళన కలిగిస్తుంది. దంపతుల మధ్య అవగాహన, ప్రేమాభిమానాలు పెంపొందుతాయి. వాతావరణంలో మార్పువల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. పరుషమైన మాటలు సంబంధాలను దెబ్బతీస్తాయి. 
 
కుంభం : ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఇతరులకు మేలు చేసినా విమర్శలు తప్పవు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, అధికారులతో చికాకులు తలెత్తుతాయి. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యంలో స్వల్ప తేడాలుంటాయి. 
 
మీనం : ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి మన్నలు పొందుతారు. సంఘంలో మీ మాటకు గౌరవ మర్యాదలు తక్కువగా లభిస్తాయి. బంధు మిత్రులను కలుకుంటారు. స్త్రీలకు దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. రుణాల కోసం అన్వేషిస్తారు.