మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

26-06-2020 శుక్రవారం దినఫలాలు - దుర్గాదేవిని పూజిస్తే...

మేషం : కొబ్బరి, పండ్లు, పూల, పానీయ వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. స్త్రీల మాటకు బంధువుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. ఒకే కాలంలో అనేక పనులు చేపట్టడం వల్ల కాంట్రాక్టర్లకు సమస్యలు తప్పవు. కుటుంబ, ఆర్థిక సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి.
 
వృషభం : రాజకీయాలలోని వారికి సంఘంలో స్థాయి పెరుగుతుంది. బంధు మిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, తిప్పట వంటివి తప్పవు. స్త్రీలకు అధిక శ్రమ, దూరదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో పోటీని ధీటుగా ఎదుర్కొంటారు.
 
మిథునం : ఆర్థిక స్థితి ఆశించినంత విధంగా మెరుగుపడకపోవడంతో నిరుత్సాహం తప్పదు. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది. బ్యాంకుల్లో మీ పనులకు స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. ఏ అవకాశం కలిసిరాక నిరుద్యోగులు ఆందోళన చెందుతారు. 
 
కర్కాటకం : ఉద్యోగస్తులు తోటివారితో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీలకు విలాస వస్తువులు, ఆడంబరాలు పట్ల మక్కువ పెరుగుతుంది. మీ అవసరాలకు సరిపడ ధనం సమకూర్చుకుంటారు. సన్నిహితుల గురించి ఆందోళన చెందుతారు. ఎదుటివారు మీ నుంచి సమాచారం సేకరించేందుకు యత్నిస్తారు. 
 
సింహం : వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా రాబడి ఆశించినంతగా ఉండదు. శారీరకశ్రమ, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. స్త్రీలకు పనివారితో సమస్యలు తప్పవు. ఒక వ్యవహారం నిమిత్తం ఒకటికి పదిసార్లు యత్నించాల్సి ఉంటుంది. రహస్య విరోధులు అధికం కావడం వల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. 
 
కన్య : ఇతరులకు బాధ్యతలు అప్పగించి ఇబ్బందులెదుర్కొంటారు. గృహ నిర్మాణాలు, మరమ్మతులలో వ్యయం అధికమవుతుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు అధికారులతో పర్యటనలు, ఒత్తిడి అధికం. పెద్ద మొత్తం ధనసహాయం క్షేమంకాదు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. 
 
తుల : ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాభివృద్ధికై చేయు కృషిలో పోటీ అధికం కావడంతో ఆందోళన తప్పదు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. సంఘంలో మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. రాజకీయ నాయకులకు ఊహించని అవరోధాలు తలెత్తినా తలెవితో పరిష్కరిస్తారు. 
 
వృశ్చికం : ఉపాధ్యాయులకు యామాన్యం ఒత్తిడి, అధికం. మార్కెట్ రంగాల వారికి లాభదాకయమైన అవకాశం కలిసివస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. 
 
ధనస్సు : పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. విద్యుత్, ఏసీ, మెకానికల్ రంగాలలో వారికి పురోభివృద్ధి. సంతృప్తి కానవస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలను ఎదుర్కొంటారు. 
 
మకరం : ఆర్థిక, వ్యాపార విషయాలను గోప్యంగా ఉంచండి. ఉద్యోగస్తులకు ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. కోర్టు వాయిదాలకు హాజరు అవుతారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. నూతన వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి బాగా శ్రమించాలి. 
 
కుంభం : బంధువులను మీ స్థితిగతులను చూసి అసూయపడే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. వ్యాపారాల అభివృద్ధికి కొత్త కొత్త పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. బ్యాంకింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం. 
 
మీనం : ప్రముఖుల సహకారంతో ఒక సమస్య మీకు సానుకూలంగా పరిష్కారమవుతుంది. కుటుంబ అవసరాలు, ఖర్చులు పెరిగే ఆస్కారం ఉంది. స్త్రీల కారణంగా మాటపడవలసి వస్తుంది. పత్రిక, ప్రైవేటు సంస్థల ఉద్యోగస్తులకు ఏకాగ్రత ఎంతో ముఖ్యం. నిరుద్యోగులకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం.