గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

21-06-2020 ఆదివారం దినఫలాలు - సూర్యనారాయణ పారాయణం చేస్తే...

మేషం: ఉద్యోగస్తులు విశ్రాంతి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. బంధువుల కోసం ధనం మితంగా వ్యయం చేయండి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
వృషభం: మత్స్య, కోళ్ల, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది.
 
మిథునం: చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. మీ మౌనం వారికి గుణపాఠం అవుతుంది. స్త్రీల మనోవాంఛలు నెరవేరుతాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఎవరినీ అతిగా విశ్వసించడం మంచిది కాదు.
 
కర్కాటకం: పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. రాజకీయ నాయకులకు ప్రయాణాల్లో మెళకువ అవసరం. ఖర్చులు అదుపుకోకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది.
 
సింహం: సంఘంలో మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. పరిచయం ఉన్న వ్యక్తుల గురించి ఆశ్చర్యకరమైన వార్తలు వింటారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. చేపట్టిన పనులు విసుగును కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు.
 
కన్య: ప్రేమికుల ఆలోచనలు పెడదారి పెట్టే ఆస్కారం ఉంది. పారిశ్రామిక రంగంలోని వారికి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు దక్కుతాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది.
 
తుల: వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. సన్నిహితులతో కలసి సభలు, సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొంతమంది మీ ఆలోచనలను తప్పుదారి పట్టించేందుకు ఆస్కారం వుంది.
 
వృశ్చికం: బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. స్త్రీలు ఆభరణాలు, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. ప్రముఖులతో చర్చలు జరుపుతారు. రావలసిన ధనం అందినా దానికి తగినట్టుగానే ఖర్చులుంటాయి. లోపం వల్ల ఒత్తిడి, ఆందోళనలు తప్పవు.
 
ధనస్సు: బంధువులతో సఖ్యత లోపిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పట్ల ఆసక్తి పెరుగుతుంది. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన త్వరలోనే కార్యరూపం దాల్చుతుంది. స్త్రీలు ఒత్తిళ్ళు, మొహమ్మాటాలకు పోవటం వల్ల ఇబ్బందులెదుర్కోక తప్పదు. ఖర్చులు అదుపుకోకపోగా మరింత ధన వ్యయం అవుతుంది.
 
మకరం: సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మత్స్యకోళ్ళ వ్యాపారస్తులకు పనిభారం అధికమవుతుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. స్త్రీలకు తమ మాటే నెగ్గాలనే పట్టుదల అధికమవుతుంది. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం కొంత ముందు వెనుకాలైనా అందుతుంది.
 
కుంభం: స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా కుటుంబంలో కలహాలు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతుంది. ఉమ్మడి వ్యాపారాలు, వాణిజ్య ఒప్పందాలు ఒక కొలిక్కి వస్తాయి. వాహనం నడుపునపుడు మెలకువ వహించండి.
 
మీనం: మీ కళత్ర మొండి వైకరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. రుణాల తీర్చడంతో పాటు తాకట్టు వస్తువులను విడిపిస్తారు. దూర ప్రయాణాల్లో అప్రమత్తంగా మెలగండి. మీ సంతానం భవిష్యత్ గురించి కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. సోదరీ సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు.