శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : మంగళవారం, 16 జూన్ 2020 (10:14 IST)

16-06-2020 మంగళవారం దినఫలాలు - కార్తికేయుడిని పూజిస్తే జయం (video)

మేషం : ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వ్యాపారాలు బాగుగా అభివృద్ధి చెందుతాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులతో మెళకువ అవసరం.
 
వృషభం : ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. తలపెట్టిన పనులలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు శుభదాకయంగా ఉంటుంది. దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. 
 
మిథునం : ఆదాయానికి మించి ఖర్చులు అధికమవుతాయి. వృత్తుల వారికి అవమానాలు వంటివి తలెత్తుతాయి. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదాపడతాయి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. 
 
కర్కాటకం : మీ చిన్నారుల భవిష్యత్ గురించి తగు శ్రద్ధ తీసుకుంటారు. ఖర్చులు రాబడికి తగినట్టుగా ఉంటాయి. స్త్రీల మాటకు ఆదరణ. సంఘంలో గౌరవం లభిస్తాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు మెళకువ అవసరం. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. 
 
సింహం : ఆర్థికంగా పురోభివృద్ధి చెందుతారు. రాజకీయ నాయకులు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ చిన్నారుల కోసం నూతన పథకాలు వేసి జయం పొందగలుగుతారు. విద్యార్థినులు పట్టుదలతో శ్రమించిన సత్ఫలితాలు సాధించగలరు. విద్యుత్, ఏసీ కూలర్లు, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. 
 
కన్య : అరుదైన ఆపరేషన్లను వైద్యులు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులకు ఊహించని అవరోధాలు తలెత్తినా తెలివితో పరిష్కరించగలరు. గృహ మరమ్మతులు, మార్పులు, చేర్పులు ఆకస్మికంగా వాయిదాపడతాయి. కొత్త దంపతులకు పలు ఆలోచనలు స్ఫురిస్తాయి. శత్రువులను మీ వైపునకు ఆకట్టుకుంటారు. 
 
తుల : ఉమ్మడి కుటుంబ విషయాలలో మాటపడాల్సి వస్తుంది. వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యంలో చిన్నచిన్న సమస్యలు తలెత్తవచ్చు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ సంతానం కోసం ధనం బాగుగా ఖర్చు చేస్తారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. 
 
వృశ్చికం : సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మిమ్మలను తప్పుదారిపట్టించి లబ్ది పొందాలని యత్నిస్తారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. సంఘంలోనూ కుటుంబలోనూ గౌరవ మర్యాదలు పొందుతారు. ప్రింటింగ్ స్టేషనరీ రంగాలలో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానవచ్చును. 
 
ధనస్సు : చేతి వృత్తుల వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. ఫ్లీడర్లకు, ఫ్లీడరు గుమస్తాలకు పురోభివృద్ధి. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత మిత్రుల నుంచి ఒక ముఖ్య సమాచారం గ్రహిస్తారు. రాజకీయ నాయకులకు పదవీ సమస్యలు అధికమవుతాయి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. 
 
మకరం : సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ వాహనం ఇతరులకి ఇచ్చి విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మొండి బాకీలు సైతం కొంతమేరకు వసూలుకాగలవు. విద్యార్థులు బజారు తినుబండరాలు భుజించుటవల్ల అస్వస్థతకు లోనవుతారు. 
 
కుంభం : ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదు అని గమనించండి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ప్రేమికులు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం అనర్థాలకు దారితీస్తుంది. ప్రతి విషయంలో ఓర్పు, సంయమనం చాలా ముఖ్యం. 
 
మీనం : హోటల్, తినుబండారు వ్యాపారులకు లాభదాకయకం. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి సమస్యలు ఎదుర్కొంటారు. ఊహించని ఖర్చులే ఉంటాయి. ధనం కోసం వేతుకులాడుకునే ఇబ్బంది ఉండదు. అనుకున్న పనులు ఆశించినంత చురుకుగా సాగవు.