బుధవారం, 1 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

12-06-2020 శుక్రవారం రాశి ఫలితాలు.. ఇష్టకామేశ్వరి దేవిని?

Istakameshwari
ఇష్టకామేశ్వరి దేవిని పూజించడం వల్ల సర్వదా శుభం కలుగుతుంది. 
 
మేషం: స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. పెద్దలు అయిన వారి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచది కాదు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు క్షేమం కాదు. ఒక ప్రయత్నం ఫలించడంతో మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. 
 
వృషభం: నరాలు, తల, ఎముకలకి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు. స్త్రీలకు షాపింగ్‌లోను వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ప్రధానం. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. జాయింట్ వ్యాపారాలు, ఉమ్మడి వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి.
 
మిథునం: వార్తా సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో జయం చేకూరుతుంది. నూతన ప్రదేశాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దంపతుల మధ్య దాపరికం మంచిది కాదు. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. రాబోయే ఖర్చులకు తగ్గట్టు ఆదాయం పెంచుకుంటారు.
 
కర్కాటకం: ప్రేమికులకు మధ్య పెద్దల వల్ల సమస్యలు తలెత్తగలవు. పన్నులు, రుణ వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. ఆప్తుల సలహాలను పాటిస్తారు. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆకస్మికంగా ఆరోగ్యంలో చికాకులు తలెత్తుతాయి.
 
సింహం: ఆర్థిక సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. ఒక యత్నం ఫలించడంతో మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. రావలసిన ధనం కోసం శ్రమ, ప్రయాసలు ఎదుర్కోవలసి వస్తుంది.
 
కన్య: నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది. ఖర్చులు, అవసరాలు పెరగడంతో అదనపు రాబడికై యత్నిస్తారు. వైద్య రంగాల్లోని వారికి పురోభివృద్ధి. మీ సిఫార్సుతో ఒకరికి చక్కని అవకాశం లభిస్తుంది. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధ్యవాలు బాగా ఉంటాయి. విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత చూపుతారు.
 
తుల: మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఏసీ కూలర్ మెకానిక్ రంగాల్లో వారికి సంతృప్తి కానవస్తుంది. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిది. 
 
వృశ్చికం: ఎప్పటి సమస్యలను అప్పుడు పరిష్కరించుకోవడం శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ప్రణాళికాబద్ధంగా పనిచేసి సత్ఫలితాలను పొందుతారు. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం.
 
ధనస్సు: బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు మిశ్రమ స్పందన ఎదురవుతుంది. కళలు, క్రీడల వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.
 
మకరం: స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పట్టుదల అధికమవుతుంది. వృత్తి వ్యాపారాల్లో పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. బ్యాంకు వ్యవహారాల్లో  పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. రాజకీయ, కళా రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి.
 
కుంభం: రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొంటారు. మీ చిన్నారుల కోసం నూతన పథకాలు వేసి జయం పొందగలుగుతారు. ఉపాధ్యాయులకు సదవకాశాలు లభిస్తాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. పాత రుణాలు తీర్చడంతో పాటు తాకట్టు విడిపిస్తారు. 
 
మీనం: విదేశాల నుంచి ఊహించని అవకాశాలు లభిస్తాయి. కొన్ని పాత వ్యవహారాలు చక్కబడతాయి. రచయితలకు, పత్రికా రంగంలో వారికి కీర్తి, గౌరవాలు పెరుగుతాయి. బ్యాంకింగ్ రంగాల వారికి పనిలో ఒత్తిడి, చికాకులు తప్పవు. బంగారు వ్యాపారులకు అనుకోని సమస్యలు ఎదురవుతాయి. రవాణా రంగాల వారికి చికాకులు తప్పవు.