శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

11-06-2020 గురువారం మీ రాశి ఫలితాలు.. సాయిబాబాను దర్శించి విభూది ధరిస్తే?

Astrology
సాయిబాబాను దర్శించి విభూది ధరించినట్లైతే శుభం కలుగుతుంది. 
 
మేషం: ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, స్వశక్తిపై జీవించాలనే పట్టుదల అధికమవుతాయి. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి అనుకూలం. పరోపకారానికి పోయి సమస్యలు తెచ్చుకోకండి. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
వృషభం: గతంలో విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలిసే అవకాశం వుంది. దూర ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలు వాయిదాపడతాయి. టెక్నిక్, వైజ్ఞానిక రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. చిన్నపాటి అనారోగ్యానికి గురై చికిత్స తీసుకోవాల్సి వస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రతలోపం వల్ల అధికారులతో మాట పడక తప్పదు.
 
మిథునం: కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. తలపెట్టిన పనులు మందకొడిగా పూర్తి చేస్తారు. మీ శ్రీమతి సహకారంతో కొన్ని సమస్యలు సానుకూలమవుతాయి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. 
 
కర్కాటకం: ఆర్థిక సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమస్యలు సమసిపోతాయి. ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. హోటల్, తినుబండారు వ్యాపారులకు లాభదాయకం. బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు. మిత్రుల రాకపోకల వల్ల గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది.
 
సింహం: శ్రమాధిక్యత, అకాల భోజనం వంటి చికాకులు తప్పవు. ఆకస్మికంగా ఆలయాలను సందర్శిస్తారు. ఖర్చులు అదుపు చేయలేకపోవడంతో మరింత ధన వ్యయం అవుతుంది. అనవసరపు ఆలోచనలతో మనసు పాడు చేసుకోకుండా అందరితో సంతోషంగా మెలగండి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు.
 
కన్య: గృహంలో మార్పులు చేర్పులు వాయిదా పడతాయి. పదవీ విరమణ చేసిన ఉద్యోగస్తులకు రావలసిన క్లయింలు ఆలస్యంగా అందుతాయి. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. విద్యుత్, ఏసీ, కూలర్లు, మెకానికల్ రంగాల్లో వారికి సంతృప్తి కానవస్తుంది. రాజకీయ కళా రంగాల వారికి కొంత అనుకూలిస్తుంది. 
 
తుల: ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో పెద్దల సలహా పాటించడం మంచిది. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. ప్రముఖులతో పరిచయాలు నూతన బంధుత్వాలు ఏర్పడతాయి. సంఘంలోను, కుటుంబంలోనూ గౌరవ మర్యాదలు పొందుతారు. వసతి ఏర్పాట్ల విషయంలో చికాకులు ఎదురవుతాయి. 
 
వృశ్చికం: వ్యాపారులకు సమస్యలు ఎదురైనా ఆదాయానికి కొదవ వుండదు. ఇతరుల సలహా కంటే సొంత నిర్ణయాలే మేలు. నిరుద్యోగులకు సదవకాశాలు లభించినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. ఉద్యోగస్తులు నూతన పరిచయాల పట్ల అప్రమత్తంగా వుండటం శ్రేయస్కరం. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. 
 
ధనస్సు: డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. మిత్రుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి.
 
మకరం: ఇంజనీరింగ్ రంగంలోని వారికి చికాకులు తప్పవు. ప్రభుత్వ కార్యాలయాల్లోని పనులు వాయిదా పడవచ్చు. ఆలయాలను సందర్శిస్తారు. రవాణా, ప్రకటనలు, బోధన, స్టేషనరీ, విద్యా రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి.
 
కుంభం: రుణ, ఇతర వాయిదా చెల్లింపులు సకాలంలో జరుపుతారు. వాతావరణంలో మార్పు మీ పనులకు ఆటంకమవుతుంది. మిత్రులతో ఏకీభవించలేకపోతారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. ప్రైవేట్ సంస్థలు, విద్యా సంస్థల్లోని వారికి యాజమాన్యం నుంచి ఒత్తిడి అధికమవుతుంది.
 
మీనం: ఆర్థికంగా కొంత పురోగతి సాధిస్తారు. దూర ప్రయాణాల్లో వస్తువుల పట్ల మెలకువ వహించండి. ఎల్ఐసీ బ్యాంకు ఫిక్సెడ్ డిపాజిట్ల ధనం అందుకుంటారు. సేవా కార్యక్రమాల్లో చురుకుంగా పాల్గొంటారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు చికాకులు తప్పవు.