శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

09-06-2020 మంగళవారం మీ రాశి ఫలితాలు..

పంచముఖ ఆంజనేయ స్వామిని తమలపాకులతో ఆరాధించినట్లైతే సర్వదా అభివృద్ధి కానవస్తుంది. 
 
మేషం: సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్లీడర్లకు తమ క్లయింట్‌ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ అవసరం. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి.
 
వృషభం: ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. అధ్యాపకులకు పురోభివృద్ధి. విద్యార్థులు కొన్ని  నిర్భందాలకు లోనవుతారు. స్త్రీలకు విలాసవస్తువులు, ఆడంబరాల పట్ల మక్కువ పెరుగుతుంది. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు.
 
మిథునం: ఆర్థికపరమైన చర్చలు, కీలకమైన నిర్ణయాలకు ఇది అనుకూలం. గృహంలో స్వల్ప మార్పులు చేర్పులు వాయిదా పడతాయి. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. గత తప్పిదాలు పునరావృత్తమయ్యే ఆస్కారం వుంది. రహస్య విరోధులు అధికం కావడం వల్ల రాజకీయాల్లో వారికి సమస్యలు తలెత్తుతాయి.
 
కర్కాటకం: మీ సంతానం భవిష్యత్ గురించి కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. శస్త్రచికిత్స చేయునప్పుడు వైద్యులకు ఏకాగ్రత అవసరం. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. ఖర్చులు పెరిగినా మీ అవసరాలకు కావలసిన ధనం సమకూర్చుకుంటారు.
 
సింహం: కంది, మినుము, మిర్చి వ్యాపారస్తులకు పురోభివృద్ధి. విద్యా, వైద్య సంస్థల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభించడంతో మానసికంగా కుదుటపడతారు. మీ అలవాట్లు, బలహీనతలు గోప్యంగా వుంచండి. ఇతరులకు ధనం ఇచ్చినా తిరిగి రాజాలదు. రావలసిన ధనం సమయానికి అందకపోవడంతో ఇబ్బందులు తప్పవు.
 
కన్య: సమావేశాల్లో పూర్వ మిత్రులను కలుసుకుంటారు. బంధుమిత్రుల నుంచి అపవాదులు, అపనిందలు వంటివి ఎదుర్కొంటారు. దీర్ఘకాలిక రుణబాధలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల ఇబ్బందులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. ఓర్పు, పట్టుదలతో అనుకున్న పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు.
 
తుల: విదేశీయాన యత్నాలలో ఆటంకాలు తొలగిపోగలవు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పరోపకారానికి పోయి సమస్యలు తెచ్చుకోకండి. గృహంలో ఏదైనా వస్తువు పోవడానికి ఆస్కారం వుంది జాగ్రత్త వహించండి. ఖర్చులు మీ రాబడికి మించడం వల్ల స్వల్ప ఒడిదుడుకులు తప్పవు. 
 
వృశ్చికం: ఆర్థికంగా బాగుగా పురోభివృద్ధి చెందుతారు. వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ అవసరం. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో జయం. రవాణా రంగాల్లో వారికి ఇబ్బందులు తప్పవు. ఉత్తర ప్రత్యుత్తరాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఫ్యాన్సీ, స్టేషనరీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు శుభదాయకం.
 
ధనస్సు: వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారులకు పనివారలతో చికాకులు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు మార్పులు తథ్యం. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. తల, నరాలు, ఎముకలు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. మనోధైర్యంతో ఎంతటి కార్యాన్నైనా సాధించ గలుగుతారు. 
 
మకరం: గృహోపకరణాల వస్తువుల కొనుగోలుకై షాపింగ్ చేస్తారు. స్త్రీల యత్నాలకు అయిన వారి నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. ఎరువులు, విత్తనాల వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. సోదరీ సోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. 
 
కుంభం: భాగస్వామిక చర్చల్లో కొత్త ప్రతిపాదనలు చోటుచేసుకుంటాయి. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మొక్కుబడులు, దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మిత్రుల రాకపోకల వల్ల గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు.
 
మీనం: మీ చిన్నారుల భవిష్యత్తు గురించి శ్రద్ధ తీసుకుంటారు. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. స్త్రీలు ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. మీరు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం పొందుతారు. కొత్త దంపతులుకు పలు ఆలోచనలు స్ఫురిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.