శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By ఠాగూర్

17-06-2020 బుధవారం దినఫలాలు - నరసింహ స్వామిని ఆరాధిస్తే...

మేషం : అకాల భోజనం, శ్రమాధిక్యత వల్ల స్వల్ప అస్వస్థతకు లోనవుతారు. షాపింగ్‌లో దుబారా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వైద్యులకు పేరు, ఖ్యాతి లభిస్తాయి. ఓ చక్కని వ్యక్తి సాహచర్యం లభిస్తుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. 
 
వృషభం : విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. వ్యాపారాల్లో స్వల్ప ఆటంకాలు మినహా ఇబ్బందులుండవు. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వసతి ఏర్పాట్ల విషయంలో చికాకులు ఎదురవుతాయి. సోదరీ, సోదరుల మధ్య అనుబంధాలు బలపడతాయి. రుణం తీర్చి తాకట్టు పెట్టిన వస్తువులు విడిపించుకుంటారు. 
 
మిథునం : ఉద్యోగస్తులకు పై అధికారులతో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టంమ్మీద పూర్తి చేస్తారు. దైవ, సేవా, పుణ్య కార్యాలకు ధనం బాగా వెచ్చిస్తారు. రాజకీయ రంగాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. మీ అతిథి మర్యాదలు అందరినీ ఆకట్టుకుంటాయి. 
 
కర్కాటకం : బకాయిలు, ఇంటి అద్దెల వసూళ్ళలో చికాకులు, ప్రయాసలు తప్పవు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. చిన్నారులకు అవసరమైన వస్తువులు సేకరిస్తారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అనవసరపు విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. 
 
సింహం : అధైర్యం వీడి ధైర్యంతో ముందుకు సాగి జయం పొందండి. రచయితలకు, పత్రికా రంగంలోవారికి ప్రోత్సాహం కానవస్తుంది. పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు లాభదాకయం. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. గృహంలో ఏదైనా వస్తువు పోవడానికి ఆస్కారం కలదు. జాగ్రత్త వహించండి. 
 
కన్య : మీలోని బలహీనతలు తొలగించుకోవడంపై దృష్టిపెడతారు. విదేశీయాన ప్రయాణాలు వాయిదాపడతాయి. ఔదరార్యమున్న స్నేహితులు మీ ఆర్థికావసరాలకు అందివస్తారు. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. మీరంటే అందరికీ గౌరవం ఏర్పడుతుంది. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. 
 
తుల : విద్యుత్, ఏసీ, కూలర్లు, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. మీ చిన్నారుల కోసం నూతన పథకాలు వేసి జయం పొందగలుగుతారు. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి అభద్రతాభావం, ఆందోళనలకు గురవుతారు. 
 
వృశ్చికం : పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. రాజకీయ నాయకులకు ఊహించని అవరోధాలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. సంఘంలో మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాభివృద్ధికై చేయు కృషిలో పోటీ అధికంకావడంతో ఆందోళన తప్పదు. 
 
ధనస్సు : ఆర్థిక విషయాలలో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. మీ అభిప్రాయాలు, మనోభావాలు సున్నితంగా వ్యక్తం చేయండి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. రేపటి గురించి ఆలోచన చేస్తారు. 
 
మకరం : స్త్రీలు అందరి యందు కలుపుగోలుతనంగా వ్యవహరించడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. పాత మొండిబాకీలు వసూలవుతాయి. ఉద్యోగస్తులకు తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. చిన్నపాటి అనారోగ్యానికి గురైనా చికిత్స తీసుకోవాల్సి వస్తుంది. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. 
 
కుంభం : ఆర్థిక విషయాలలో ఊహించని మార్పు కానవస్తుంది. ఎదుటివారి వేషధారణ చూసి మోసపోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. 
 
మీనం : మీ బలహీనతలను కొంతమంది స్వార్థానికి వినియోగించుకుంటారు. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. గతంలో జరిగిన తప్పుల నుంచి మంచిని నేర్చుకోండి.