గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : బుధవారం, 15 జులై 2020 (09:56 IST)

15-07-2020 బుధవారం రాశిఫలాలు - నిరుద్యోగులు భేషజాలకు.. (video)

మేషం : విదేశీ ప్రయాణాలు వాయిదాపడతాయి. అందరితో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. కూర, పూల, వ్యాపారస్తులకు సంతృప్తి కానరాదు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల తీరు అసహనం కలిగిస్తుంది. బంధు మిత్రులతో రహస్య సంభాషణలు కొనసాగిస్తారు. 
 
వృషభం : ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. స్త్రీలు, టీవీ చానెల్స్, కార్యక్రమాలలో రాణిస్తారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహించండి. రాజకీయాల వారు కార్యకర్తల వల్ల సమస్యలను ఎదుర్కొనక తప్పదు. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేస్తారు. 
 
మిథునం : నిరుద్యోగులు భేషజాలకుపోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. క్రయ, విక్రయాలు సామాన్యంగా ఉంటాయి. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. అనవసర ప్రసంగం వల్ల అధికారులతో అవగాహన కుదరకపోవచ్చు. ఖర్చులు మీ ఆదాయానికి తగినట్టుగానే ఉంటాయి. 
 
కర్కాటకం : వృత్తుల వారిలో ప్రోత్సాహం లభిస్తుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబీకులు మీ అభిప్రాయాలతో ఏకీభవించలేకపోతారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. 
 
సింహం : భార్యాభర్తల ఆలోచనలు, అభిప్రాయభేదాలు భిన్నంగా ఉంటాయి. కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. మెళకువ వహించండి. క్యాటరింగ్, స్టేషనరీ ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. ఉద్యోగస్తులు మార్పులకై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. 
 
కన్య : ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఖర్చులు అధికం. ప్రముఖుల ఇంటర్వ్యూల కోసం అధికం సమయం వేచి ఉండాల్సి వస్తుంది. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయడం వల్ల అశాంతికి లోనవుతారు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో ఖర్చుకు వినియోగించకవలసి వస్తుంది. 
 
తుల : ఆర్థిక విషయాలలో మీ లెక్కలు తారుమారవు కాగలవు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. ఏ విషయంలోనూ హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. స్త్రీలకు షాపింగ్‌లోనూ, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ప్రధానం. 
 
వృశ్చికం : ఆర్థిక, కుటుబం విషయాలపై శ్రద్ధ వహిస్తారు. బంధువులతో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వస్త్ర, బంగారు, వెండి వ్యాపారస్తులకు పురోభివృద్ధి. శత్రువులపై విజయం సాధిస్తారు. రాజకీయల వారు కార్యకర్తల వల్ల సమస్యలను ఎదుర్కొనక తప్పదు. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి 
 
ధనస్సు : ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. వేతనం తక్కువైనా వచ్చిన అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవడం శ్రేయస్కరం. సామూహిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు విజయం సాధిస్తారు. మీ మాటలు ఇతరులకు జారవేసే వ్యక్తులున్నారన్న విషయం గమనించండి. 
 
మకరం : ఆర్థిక వ్యవహారాలలో భాగస్వామి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు కార్యాలయ పనులతో పాటు సొంత పనులు కూడా పూర్తికాగలవు. దూర ప్రయాణాలలో సమస్యలు తలెత్తుతాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలోనివారికి పనివారలతో చికాకులు ఎదుర్కొంటారు. ఇతరుల సలహా కంటే సొంత నిర్ణయాలే మేలు. 
 
కుంభం : ఖర్చులు తక్కువగా ఉండటం వల్ల పొదుపు చేస్తారు. ఉమ్మడి వెంచర్లు, కాంట్రాక్టర్లకు అనుకూలం. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునలాలోచన మంచిది. స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల భంగపాటుకు గురవుతారు. నూతన పరిచయాలు, వ్యాపకాలు ఏర్పడతాయి. 
 
మీనం : కాంట్రాక్టర్లకు ఎప్పటి నుంచో ఆగివున్న పనులు పునఃప్రారంభమవుతాయి. పాత రుణాలు తీరుస్తారు. ఫ్యాన్సీ, కిరాణా, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు కలిసివచ్చే కాలం. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. పనులకు ఆటంకాలు కల్పించాలన్న వారు సైతం అనుకూలంగా మారతారు.