శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శనివారం, 18 జులై 2020 (09:11 IST)

18-07-2020 శనివారం రాశిఫలాలు - పాత మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు... (video).

మేషం : సహోద్యోగులతో కళా, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దంపతుల మధ్య పరస్పర అవగాహనా లోపం. కోర్టు వ్యవహారాలు, ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి చికాకులు తప్పవు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. 
 
వృషభం : బ్యాంకింగ్ వ్యవహారాల పట్ల అప్రమత్తత అవసరం. కుటుంబంలో పెద్దల వైఖరి ఆనందం కలిగిస్తుంది. మీ ముఖ్యుల కోసం ధనం బాగా వెచ్చించవలసి ఉంటుంది. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మిమ్మల్ని తక్కువ అంచనా వేసేవారు మీ సహాయం అర్థిస్తారు. రావలసిన బాకీలు వసూలవుతాయి. 
 
మిథునం : ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలు, వేడుకల్లో పాల్గొంటారు. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. ఏదో సాధించలేకపోయామన్న భావం మిమ్మల్ని వెన్నాడుతుంది. స్త్రీలు తొందరపాటుతనం వల్ల ప్రియతములను దూరం చేసుకుంటారు. 
 
కర్కాటకం : ఇతరులను సహాయం అర్థించి భంగపాటుకు గురవుతారు. పాత మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. రవాణా రంగాల వారికి మెళకువ, ఏకాగ్రత అవసరం. రుణాలు, పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తారు. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. 
 
సింహం : మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఇంట్లో మార్పులు, చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. శత్రువులు, మిత్రులుగా మారుతారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ఆకస్మికంగా బిల్లులు చెల్లిస్తారు. 
 
కన్య : వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. దానధర్మాలు చేయడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ఓర్పు, పట్టుదలతో శ్రమించిన గాని చేపట్టిన పనులు పూర్తికావు. మీ సంతానం కోసం విలువైన వస్తువులు సేకరిస్తారు. 
 
తుల : ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. ఉద్యోగస్తులు పై అధికారులతో సంభాషించునపుడు మెళకువ అవసరం. ఉమ్మడి వ్యవహారాలు, ఓర్పు, సహనంతో వ్యవహారాలు చక్కదిద్దుకుంటారు. విద్యార్థులు మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. బంగారం, వెండి, గృహోపకరణాల వ్యాపారులకు శుభదాయకం. 
 
వృశ్చికం : వైద్య, ఇంజనీరింగ్, శాస్త్ర, వాణిజ్య రంగాల్లో వారికి ఆశించినంత ఫలితం ఉండదు. నిరుద్యోగులకు అవకాశం చేజారిపోయే ఆస్కారం ఉంది. రావలసిన ధనం చేతికందడంతో రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరగలదు. వస్త్రాలు, ఆభరణాలు, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరిక నెరవేరుతుంది. 
 
ధనస్సు : దీర్ఘకాలిక పెట్టుబడులు, నూతన వ్యాపారాలు, జాయింట్ వెంచర్ల అనుకూలతకు మరికొంతకాలం వేచియుండటం మంచిది. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి. మీ మాటలకు సంఘంలో గౌరవం లభిస్తుంది. 
 
మంకరం : హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. ఉద్యోగస్తులు సమర్థంగా పని చేసి పైఅధికారుల మన్నలను పొందుతారు. కాంట్రాక్టర్లకు మంచి మంచి అవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోలేరు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. 
 
కుంభం : ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు వైద్య, ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశం లభిస్తుంది. స్త్రీలకు ఆహార, ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ఉద్యోగస్తులు, క్లిష్ట సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు మందకొడిగా సాగుతాయి. 
 
మీనం : స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. ఆకస్మికంగా దూర ప్రయాణాలు వాయిదాపడతాయి. ప్రింటింగ్ స్టేషనరీ రంగాల వారికి చికాకులు తప్పవు. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. ఉపాధ్యాయులకు యామాన్యం ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. చేపట్టిన పథకాలు, ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి.