సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

22-07-2020 బుధవారం రాశిఫలాలు - ధనం విపరీతంగా ఖర్చవుతుంది...

మేషం : కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. విద్యార్థులకు ఆశించిన విద్యావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. మీ సంతానానికి స్థోమతకు మించిన వాగ్ధానాలు వల్ల ఇబ్బందులెదుర్కొంటారు. కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. 
 
వృషభం : స్టేషనరీ ప్రింటింగ్ రంగాల వారికి సంతృప్తి. పురోభివృద్ధి. విద్యార్థులు కొన్ని నిర్బంధాలు లోనవుతారు. వ్యాపారాభివృద్ధికి నూతన ప్రణాళికలు, పథకాలు అమలు చేస్తారు. బంధు మిత్రుల నుంచి ధనసహాయ విషయంపై ఒత్తిడి, మొహమ్మాటాలు అధికంగా ఉంటాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
మిథునం : ఉదయోగస్తులకు అందిన ఒక సమాచారం నిరుత్సాహం కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. ధనం ఇతరులకు ఇచ్చినా తిరిగి రాజాలదు. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో శ్రమాధిక్యత ప్రయాసలెదుర్కొంటారు. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి సోదరుల మధ్య ఒక అవగాహన ఏర్పడుతుంది. 
 
కర్కాటకం : పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఆశాజనకం. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఇతరులకు ధనసహాయం చేసే విషయంలో మెళకువ వహించండి. దంపతులు ప్రతి విషయంలోనూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటారు. ఖర్చులు విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. 
 
సింహం : మార్కెటింగ్ రంగాల వారికి యాజమాన్యం నుంచి అనుక్షణం వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుంది. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. ఆదాయానికి మించిన ఖర్చుల వల్ల ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. విధి నిర్వహణలో మీరు చూపించే శ్రద్ధ సమర్థతకు అధికారుల నుంచి గుర్తింపు, ఆర్థిక పురోభివృద్ధి పొందుతారు. 
 
కన్య : ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను ధీటుగా ఎదుర్కొంటారు. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారిక మిశ్రమ ఫలితం. ఆకస్మికంగా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వీలైనంత తక్కువగా మాట్లాడి ఎదుటివారి నుంచి సమాచారం రాబట్టేందుకు యత్నించండి. భాగస్వామిక వ్యవహారల్లో కొత్త ప్రతిపాదనలు చోటుచేసుకుంటాయి. 
 
తుల : పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. రుణయత్నం ఫలిస్తుంది. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పదు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. స్త్రీలకు విలాస వస్తువుల, ఆడంబరాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వస్త్ర, బంగారం వ్యాపారులకు సామాన్యం. క్రయ, విక్రయాలు మందకొడిగా ఉంటాయి. 
 
వృశ్చికం : అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు తలకిందులవుతాయి. హోదాలో ఉన్న అధికారులు అపరిచితుల వల్ల ఇబ్బందులు గురయ్యే ఆస్కారం ఉంది. వ్యవసాయ కూలీలకు అశాజనకంగా ఉంటుంది. 
 
ధనస్సు : రావలసిన ధనం చేతికందుతుంది. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి ప్రతి విషయంలోనూ ఏకాగ్రత ముఖ్యం. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. చేతివృత్తులు, చిన్నతరహా పరిశ్రమల వారికి ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. 
 
మకరం : ఉద్యోగస్తులకు వాహన సౌఖ్యం. పదోన్నతి వంటి శుభపరిణామాలుంటాయి. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. ప్రేమికుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. మీ మాటకు కుటుంబంలోనూ, సంఘంలోనూ వ్యతిరేక ఎదురవుతుంది. 
 
కుంభం : ఆపద సమయంలో మిత్రుల అండగా నిలుస్తారు. వృత్తులు, క్యాటరింగ్ పనివారల శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. స్త్రీలకు ఖరీదైన వస్తు కొనుగోళ్ళలో ఏకాగ్రత అవసరం. సమయానుకూలంగా మీ ఆహారపు అలవాట్లు, పద్ధతులు మార్చుకోవలసి వస్తుంది. గృహ నిర్మాణాల్లో వ్యయం మీ అంచనాలను మించుతుంది.
 
మీనం : స్త్రీలకు సంభాషించేటపుడు సంయమనం పాటించండి. పాత మిత్రుల కలయికతో మీలో కొంత మార్పు వస్తుంది. ఓర్పు, కార్యదీక్షతో పని చేసి అనుకున్నది సాధిస్తారు. వ్యాపారాభివృద్ధికి మీరు వేసే ప్రణాళికలు, పథకాలు సత్ఫలితాలను ఇస్తాయి. ధనం విపరీతంగా వ్యయం అయినా ప్రయోజనకరంగా ఉంటాయి.