గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 జులై 2020 (13:42 IST)

బ్యాంకులో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? ఎస్‌బీఐ నుంచి గుడ్ న్యూస్

బ్యాంకులో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? అయితే ఎస్‌బీఐ నుంచి గుడ్ న్యూస్ వచ్చేసింది. బ్యాంకింగ్ పరీక్షలు రాయడానికి ప్రిపేర్ అవుతున్న వారి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 3850 ఖాళీల భర్తీకి గాను సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 
 
ఈ ఉద్యోగాల్లో గుజరాత్, తెలంగాణ సర్కిల్‌కు 550 ఖాళీలను ప్రకటించింది. మొత్తం 3850 పోస్టుల భర్తీకి తెలంగాణతో పాటు గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తమిళనాడు, రాజస్తాన్, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను కోరుతుంది. 2020 జూలై 27 రోజు నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. చివరి తేది 2020 ఆగస్ట్ 16 వరకు ఉంది.
 
2020 జూలై 27వ తేదిన దరఖాస్తులు ప్రారంభం
2020 ఆగస్ట్ 16వ తేదిన దరఖాస్తులకు చివరి రోజు
2020 ఆగస్ట్ 16వ తేదిన దరఖాస్తు ఎడిట్ చేయడానికి చివరి రోజు
2020 ఆగస్ట్ 31వ తేది దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి రోజు
 
విద్యార్హత - ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన అర్హత పరీక్షలు ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు- 2020 ఆగస్ట్ 1 నాటికి 30 ఏళ్ల లోపు
ఎంపిక విధానం - దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ