Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

మలేషియా ప్రధానికి కరోనా - ఏపీలో మరో 47 కరోనా పాజిటివ్ కేసులు

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 24 మే 2020 (08:34 IST)
మరో దేశ ప్రధానికి కరోనా వైరస్ సోకింది. ఇప్పటికే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ఈ వైరస్ సోకింది. ఆ తర్వాత ఆయన ఆస్పత్రిలో చికిత్స పొంది తిరిగి కోలుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మలేషియా ప్రధాని ముహిద్దీన్ యాసిన్‌ ఈ వైరస్ కోరల్లో చిక్కుకున్నారు. 
 
యాసిన్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఆ పరీక్షా ఫలితాల్లో పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన్ను 14 రోజుల పాటు క్వారంటైన్‌కు వెళ్లాల్సిందిగా వైద్యులు సలహా ఇచ్చారు. మలేషియా ప్రధాని ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ నుంచే ఆయన  ఈ వైరస్ సోకినట్టు వైద్యులు భావిస్తున్నారు. 
 
ఏపీలో 47 కరోనా కేసులు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఐదు కరోనా పాజిటివ్ కేసులు చెన్నై కోయంబేడుతో అనుసంధానమైవున్నాయి. ఈ కేసులతో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 2561కు చేరింది. అలాగే, ఇప్పటివరకు ఆస్పత్రుల నంచి 1778 మంది డిశ్చార్జ్ అయ్యారు. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments