మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 అక్టోబరు 2020 (10:25 IST)

తెలంగాణలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1481 కరోనా కేసులు నమోదు కాగా.. నలుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో నమోదైన పాజిటీవ్ కేసుల సంఖ్య 2,34,1562కి చేరగా.. 1,319 మంది మృతిచెందారు.
 
రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 17,916 యాక్టివ్‌ కేసులు ఉండగా, చికిత్స నుంచి కోలుకుని 2,14,917 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు బుధవారం ఉదయం ఈ మేరకు బులిటెన్ విడుదల చేశారు. కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 279, మేడ్చల్‌ 138, రంగారెడ్డి 111, ఖమ్మం 82, నల్గొండ 82, భద్రాద్రి 79 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు అధికారులు పేర్కొన్నారు.
 
గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 279, ఆదిలాబాద్ 16, భద్రాద్రి కొత్తగూడెం 79, జగిత్యాల్‌ 38, జనగాం 24, జయశంకర్ భూపాలపల్లి 17, జోగులమ్మ గద్వాల్‌ 12, కామారెడ్డి 38, కరీంనగర్‌ 79, ఖమ్మం 82, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 9, మహబూబ్‌ నగర్‌ 35, మహబూబాబాద్‌ 33, మంచిర్యాల్‌ 24, మెదక్‌ 23, మేడ్చల్ మల్కాజ్‌గిరి 138, ములుగు 20, నాగర్‌ కర్నూల్‌ 27, నల్గొండ 82, నారాయణ్‌పేట్‌ 4, నిర్మల్‌ 21, నిజామాబాద్‌ 32, పెద్దంపల్లి 26, రాజన్న సిరిసిల్ల 27, రంగారెడ్డి 111, సంగారెడ్డి 32, సిద్ధిపేట్‌ 34, సూర్యాపేట 47, వికారాబాద్‌ 13, వనపర్తి 0, వరంగల్‌ రూరల్‌ 24, వరంగల్‌ అర్బన్‌ 45, యాద్రాది భువనగిరి 10 కేసులు నమోదయ్యాయి.