అల్లుడిపై మనసు పారేసుకున్న యువతి ... తండ్రి మందలించడంతో...

suicide
ఠాగూర్| Last Updated: మంగళవారం, 27 అక్టోబరు 2020 (09:28 IST)
వరుసకు అల్లుడు (అన్న కుమారుడు)పై ఓ మైనర్ బాలిక మనసు పారేసుకుంది. ఈ విషయం తెలిసిన తల్లిందడ్రులు ఆమెను మందలించారు. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలో తాగా తన ప్రియుడితో అర్థరాత్రి చాటింగ్ చేస్తూ తండ్రి కంటపడింది. దీంతో ఆయన కాస్తంత గట్టిగా మందలించడంతో ఆ యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో ఆ యువతి తెల్లారేసరికి అనుమానాస్పదంగా కనిపించింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా నార్నూల్ మండలంలోని ఆదిలాబాద్ గ్రామంలో జరిగింది.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మండల కేంద్రమైన నార్నూలులోని పోలీస్ స్టేషనులో ఇందూరు ఊశన్న హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఈయన భార్య వసంత. అదిలాబాద్ గ్రామం. అయితే, వసంత ఆదిలాబాద్‌లో అంగన్‌వాడీ విధులు నిర్వహిస్తుండగా, కరోనా నేపథ్యంలో తన కూతురు వైష్ణవి (15)తో కలిసి స్థానిక క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు.

తన ఏకైక కూతురునుగారంగా పెంచారు. ఆమె ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. రెండేళ్లుగా వైష్ణవికి వరుసకు అన్న అయిన బంధువు అన్న కుమారుడితో ప్రేమ వ్యవహారం సాగుతోంది. గమనించిన కుటుంబ సభ్యులు గతంలోనే వారిని మందలించారు. ఇదే విషయమై తరచూ గొడవలు జరిగేవి. ఆమెకు కౌన్సెలింగ్‌ సైతం చేసినా మార్పు రాలేదు.

శుక్రవారం రాత్రి ఫోన్‌లో చాటింగ్‌ చేస్తుండగా గమనించిన తండ్రి మందలించడంతో మనస్థాపానికి గురైనట్లు పేర్కొన్నారు. కాగా బాలిక మృతి అనుమానాస్పదంగా ఉందని తల్లి వసంత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ శ్రీనివాస్‌ వివరించారు.దీనిపై మరింత చదవండి :