Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కోవిడ్ అప్‌డేట్.. 565 కేసులు.. ఒకరి మృతి

Written By సెల్వి
Published: బుధవారం, 2 డిశెంబరు 2020 (13:23 IST)
తెలంగాణలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 565 కరోనా కేసులు నమోదు కాగా.. ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 2,70,833కు చేరింది. 1,462 మంది మరణించారు. 
 
ప్రస్తుతం తెలంగాణలో 9,266 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 2,60,155 మంది డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. కాగా కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 106, రంగారెడ్డి జిల్లాలో 43 కరోనా కేసులు నమోదయ్యాయి.
 
ఇప్పటి వరకు రాష్ట్రం వ్యాప్తంగా కోవిడ్‌తో మృతి చెందినవారి మొత్తం సంఖ్య 1462కు చేరింది. తెలంగాణలో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 9,266గా ఉంది. గృహ, సంస్థల ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితుల సంఖ్య 7,219గా ఉంది 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments