శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 డిశెంబరు 2020 (10:00 IST)

బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీకి కరోనా పాజిటివ్

భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ, బాలీవుడ్ ప్రముఖ నటుడు సన్నీ డియోల్‌ను కరోనా వైరస్ కాటేసింది. ఆయన వయసు 64 యేళ్లు. ఈయనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూ జిల్లా మనాలీలో ఉన్న తన ఫాంహౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. 
 
కాగా, ఇటీవలే ఆయన భుజానికి ఆపరేషన్ జరిగింది. దీంతో గత కొన్ని రోజులుగా ఈ ఫాంహౌస్‌లోనే ఉంటున్నారు. ఇంతలో ఆయనకు కరోనా వైరస్ సోకింది. ఈ క్రమంలో ఆయనతో పాటు.. ఆయన స్నేహితులు ముంబై వెళ్లేందుకు సిద్ధమై కరోనా పరీక్షలు చేయించుకున్నారు. 
 
ఈ ఫలితాలు మంగళవారం రాగా, సన్నీకి కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని హిమాచల్‌ప్రదేశ్ ఆరోగ్య కార్యదర్శి అమితాబ్ అవస్థి తెలిపారు. దీంతో ఆయన తిరిగి ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. వైద్యుల సలహా మేరకు జాగ్రత్తలు పాటిస్తూ చికిత్స తీసుకుంటున్నారు.