లాక్డౌన్ డిసెంబరు 31 వరకు పొడగింపు... ముఖ కవచం తప్పనిసరి!
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మరోమారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్డౌన్ ఆంక్షలను డిసెంబరు నెలాఖరు వరకు పొడగించింది. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే పలు ఆంక్షలను సడలించింది. బీచ్‌లను పబ్లిక్‌కు ఓపెన్ చేశారు. యూజీ, పీజీ కాలేజీలను తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. రాజకీయ సమావేశాలు నిర్వహించేందుకు కూడా కొన్ని సడలింపులు ఇచ్చారు. వీటన్నింటికీ ఖచ్చితంగా కోవిడ్ నియమావళిని విధిగా పాటించాల్సివుంది.
ఇకపోతే, ప్రజలు ముఖానికి మాస్క్‌లు ధరించడాన్ని తప్పనిసరి చేసింది. క్రీడా శిక్షణ కోసం స్విమ్మింగ్ పూల్స్‌కు అనుమతి ఇచ్చారు. డిసెంబర్ 14 నుంచి మెరీనా బీచ్‌ను సందర్శించేందుకు పర్యాటకులకు అనుమతి ఇచ్చింది.
కాగా, ప్రస్తుతం చెన్నై మహానగరంతో పాటు.. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా రోజువారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన విషయం తెల్సిందే. అయినప్పటికే, దేశంలో ఈ కేసులు నమోదవుతుండటంతో లాక్డౌన్‌ను 31 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది.