శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 నవంబరు 2020 (15:27 IST)

శబరిమలలో కరోనా.. స్నానానికి సదుపాయాలు.. మరిన్ని టెస్టులు

శబరిమలలో దేవస్థాన ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చిన మర్నాడే మరో ముగ్గురు పోలీసులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని తేలింది. ఆ ముగ్గురు పోలీసుల్లో ఒకరు దేవస్థానంలోని సన్నిధానంలో డ్యూటీ చేస్తుండగా ఇద్దరు పంపా దగ్గర విధులు నిర్వహిస్తున్నారు.

ఈ ముగ్గురికీ కరోనా పాజిటివ్ అని తేలడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఆలయ పరిసరాల్లో డ్యూటీలో ఉన్న అందరికీ థర్మల్ స్కానింగ్ చేస్తున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణ అధికారి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. 
 
అలాగే దర్శనానికి వెళ్లేముందు స్నానం చేసేందుకు సదుపాయాలున్నాయి. ఇక్కడ కరోనా సోకకుండా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్ని చేసినా కరోనా కేసులు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

కౌంటర్ల దగ్గర దేవస్థాన ఉద్యోగులందరూ ఫేస్ షీల్డులు వాడాలని, ఉద్యోగులంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని రాజేంద్ర ప్రసాద్ ఆదేశించారు. నీలక్కల్ భక్తుల క్యాంపు దగ్గర మరిన్ని కరోనా టెస్టింగ్ సదుపాయాలు అందుబాటులోకి తెచ్చామని రాజేంద్రప్రసాగ్ చెప్పుకొచ్చారు.