మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 నవంబరు 2020 (10:27 IST)

శబరిమలలో సోమవారం నుంచి భక్తులకు దర్శనం భాగ్యం

కేరళలోని ప్రముఖ శబరిమల ఆలయం ఆదివారం తెరుచుకుంది. సోమవారం నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. శబరిమలలో నవంబర్ 16 నుంచి డిసెంబర్ 26 వరకు మండల పూజలు జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చేభక్తులు తప్పనిసరిగా పాటించాల్సిన నియమ నిబంధనలను ట్రావెన్‌కోర్ బోర్డు గైడ్ లెైన్స్ విడుదల చేసింది. 
 
వర్చువల్ క్యూలో రిజిస్టర్ చేసుకోని భక్తులను అనుమతించరు. వారంలో ఐదు రోజులపాటు ప్రతి రోజూ వెయ్యి మంది భక్తుల్ని మాత్రమే అనుమతిస్తారు. శనివారం, ఆదివారం రెండు వేల మందిని చొప్పున భక్తుల్ని అనుమతిస్తున్నారు.
 
కరోనా వైరస్ నేపథ్యంలో దర్శనాలపై ట్రావెన్‌కోర్‌ దేవస్వామ్‌ బోర్డు మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో రోజుకు వేయి మంది చొప్పున, శనివారం, ఆదివారంలో రెండు వేల మంది చొప్పున భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు బోర్డు వెల్లడించింది. అయితే భక్తులు తప్పనిసరిగా కరోనా నెగెటివ్‌ ధ్రువీకరణ పత్రాన్ని తెచ్చుకుంటేనే లోపలికి అనుమతిస్తామని వెల్లడించింది. 
 
ఈ మేరకు పంపాకు చేరుకునే రహదారిలో కరోనా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతోపాటు పంపా నదిలో స్నానాలపై నిషేదం విధించారు. అదేవిధంగా 60 ఏండ్లు పైబడినవారికి, పదేళ్ల లోపు పిల్లలకు శబరిమలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఆలయానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని బోర్టు పేర్కొంది.