మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : మంగళవారం, 27 అక్టోబరు 2020 (17:17 IST)

కరోనా చచ్చిపోయిందంట, రెండు గంటల్లో సర్వదర్సనం టోకెన్లు హాంఫట్

కరోనాను పూర్తిగా జనం మర్చిపోయారు. ఎప్పటిలాగే సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఒకవేళ వచ్చినా ఏమాత్రం భయం లేకుండా రెండు వారాల పాటు అలా ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకుని ఇంటికి వచ్చేస్తున్నారు. కొన్నిచోట్ల అయితే కరోనా చచ్చిపోయింది.. ఇంకేం వస్తుందీ అంటూ కామెంట్లు కూడా చేసుకుంటున్నారు. ఐతే ఇవన్నీ నిజం కాదని వైద్యులు చెపుతూనే వున్నారు.
 
ఇక అసలు విషయానికి వస్తే... అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం ఆలయాలన్నీ తెరిచే ఉన్నాయి కానీ తిరుమల క్షేత్రంలో మాత్రం పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నారు. నిన్నటి వరకు కూడా ఆన్లైన్ లోనే టోకెన్లను ఇస్తూ వచ్చింది టిటిడి. కానీ నేటి ఉదయం నుంచి మాత్రం సర్వదర్సనం టోకెన్లు.. ఉచితంగా భక్తులకు అందించింది. 3 వేల టోకెన్లను రెండు గంటల్లోనే భక్తులు పొందారు. తమ తమ ఆధార్ కార్డులను తీసుకొచ్చి టోకెన్లను పొందారు భక్తులు.
 
ఒకటిన్నర నెల తరవాత సర్వదర్సనం టోకెన్లు ఇస్తుండటంతో భక్తుల్లో ఆనందం వ్యక్తమయ్యింది. సామాజిక దూరాన్ని పాటిస్తూ టోకెన్లను పొందారు భక్తులు. నిరంతరాయంగా తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌లో టోకెన్లను టిటిడి అందించనుంది.