శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 ఆగస్టు 2022 (11:07 IST)

దేశంలో గణనీయంగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

covid test
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదు సంఖ్యలో గణనీయమైన తగ్గుదల కనిపించింది. గత 24 గంటల్లో నమోదైన పాజిటివ్ కేసులపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. 
 
సోమవారం 14 వేలుగా ఉన్న కేసులు.. తాజాగా తొమ్మిది వేల దిగువకు తగ్గాయి. సోమవారం 2.12 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 8,813 మందికి వైరస్ సోకింది. పాజిటివిటీ రేటు 4.15 శాతంగా నమోదైంది.
 
అలాగే, 24 గంటల వ్యవధిలో 15,040 మంది కోలుకున్నారు. 29 మంది మరణించారు. 2020 ప్రారంభం నుంచి 4.42 కోట్ల మందికి కరోనా సోకగా.. 98.46 శాతం మంది వైరస్‌ను జయించారు. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా క్రియాశీల కేసులు 1.11 లక్షల (0.25 శాతం)కు పడిపోయాయి. ఇప్పటివరకూ 208 కోట్ల టీకా డోసులు పంపిణీ కాగా.. అందులో నిన్న 6.10 లక్షల మంది టీకా తీసుకున్నారని మంగళవారం కేంద్రం వెల్లడించింది.