ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్

దేశంలో కొత్తగా నమోదైన కరోనా కేసులెన్ని?

covid test
దేశ వ్యాప్తంగా కొత్తగా మరో 14,917 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసులపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ రిపోర్టు మేరకు గడిచిన 24 గంటల్లో 14,917 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,42,98,318కు చేరుకుంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం 32 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 98.54 శాతంగా ఉండగా, రికవరీ రేటు 0.27 శాతంగా ఉంది.
 
సోమవారం కొత్త కేసులు 14,917
మొత్తం కేసులు 4,42,68,381
క్రియాశీలక కేసులు 1,17,508
మొత్తం మృతులు 5,27,069
కోలుకున్న వారి సంఖ్య 4,36,23,804