దేశంలో కొత్తగా మరో 14092 పాజిటివ్ కేసులు
దేశంలో కొత్తగా మరో 14092 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఈ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది. శనివారం ఈ కేసుల సంఖ్య 15815గా నమోదైన విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో గడిచిన 24 గంటల్లో 14092 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 43609566కు పెరగగా, 527037 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మరో 116861 యాక్టివ్ కేసులు వ్యాప్తంగా ఉన్నాయి. కాగా, గడిచిన 24 గంటల్లో దేశంలో 41 మంది చనిపోయారు. మరో 16464 మంది కోలుకున్నారు.