దేశంలో అంతకంతకూ పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అనేక రాష్ట్రాల్లో నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్యలో ఈ పెరుగుదల కనిపిస్తుంది. ఫలితంగా దేశ వ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 4041 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఈ విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శుక్రవారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. అదేసమయంలో గత 24 గంటల్లో కరోనా వైరస్ బాధితుల్లో 10 మంది చనిపోగా, మరో 2363 మంది కోలుకున్నారు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 21177 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 193.83 కోట్ల కరోనా వ్యాక్సిన్లు వేశారు. అలాగే, కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా సుమారుగా 85.20 కోట్లకు చేరుకున్నాయి.