బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 31 డిశెంబరు 2021 (17:51 IST)

ఒమిక్రాన్‌కు డెల్టా తోడైతే ఇక కేసుల సునామీనే: టెడ్రోస్ అథనామ్

కరోనా వేరియంట్స్ ఒమిక్రాన్‌తో పాటు డెల్టా వేరియంట్ కూడా వ్యాపిస్తోందని.. ఈ రెండూ కలిసి కేసుల సునామీని సృష్టిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ అన్నారు.
 
రికార్డు స్థాయిలో కేసులు పెరగడానికి డెల్టా, ఒమిక్రాన్ జంట ముప్పులే బాధితులు ఆస్పత్రుల పాలు కాడానికి, మృత్యువాత పడడానికి దోహదం చేస్తున్నాయని తెలిపారు. 
 
ధనిక దేశాలు బూస్టర్ డోసులు వినియోగిస్తుండడం, పేద దేశాలకు టీకాలు అందకుండా చేస్తున్నాయని హెచ్చరించారు. అన్ని దేశాలకు టీకాల పంపిణీలో సమానత సాధించేలా ధనిక దేశాలు చొరవ చూపించాలని ఆయన సూచించారు