మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 డిశెంబరు 2021 (19:25 IST)

రూ.50కే క్వార్టర్ సీసా ఇప్పిస్తామన్న 'సారాయి వీర్రాజు' : సీపీఐ నేత రామకృష్ణ

తమ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే రూ.50కే క్వార్టర్ మద్యం బాటిల్ ఇస్తామంటూ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర శాఖ కార్యదర్శి రామకృష్ణ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సోము వీర్రాజుకు మతిభ్రమించినట్టుగా ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రూ.50కే మద్యం బాటిల్ ఇపిస్తామన్న సోము వీర్రాజును ఇకపై 'సారాయి వీర్రాజు' అని పిలవాలేమో అని అన్నారు. 
 
ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే చీఫ్ లిక్కర్‌ను కారు చౌకగా ఇస్తామని సోము వీర్రాజు చెప్పడం దుర్మార్గమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలు మద్య నిషేధం కోరుకుంటుంటే బీజేపీ మాత్రం మద్యం ఏరులై పారిస్తామనడం సిగ్గుచేటన్నారు. 
 
రాష్ట్రంలో కోటి మంది మందు బాబులు ఉన్నారని, వారంతా బీజేపీ ఓట్లు వేయాలని అనడం సోము వీర్రాజు పిచ్చికి పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. సోము వీర్రాజును ఇకనుంచి 'సారాయి వీర్రాజు'గా పిలవాలేమో అని వ్యంగ్యంగా ఉన్నారు.