భారత్ యాంకర్‌పై అక్తర్ మండిపాటు.. నాతో పద్ధతిగా మాట్లాడు..
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియాకప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన సూపర్-4 మ్యాచ్‌కు ముందు ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ షోలోకి అక్తర్‌ను తొలుత ఆహ్వానించిన యాంకర్
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియాకప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన సూపర్-4 మ్యాచ్‌కు ముందు ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ షోలోకి అక్తర్‌ను తొలుత ఆహ్వానించిన యాంకర్.. అనంతరం అక్తర్‌ను ఉద్దేశించి మాట్లాడింది.
భారత్‌లో రెండో విడత స్వచ్ఛ భారత్ కూడా ప్రారంభమైందని.. చూస్తుంటే ఈ కార్యక్రమాన్ని టీమిండియా ఆటగాళ్లు కూడా సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపిస్తోందని పేర్కొంది. పాకిస్థాన్‌ను ఇప్పటికే ఉతికి ఆరేశారని, మళ్లీ ఈ రోజు అందుకు మీ ఆటగాళ్లు సిద్ధపడ్డారా? అని ప్రశ్నించింది.
ఈ మాటలతో షోయబ్‌కు చిర్రెత్తుకొచ్చింది. ఏంటా మాటలంటూ విరుచుకుపడ్డాడు. యాంకర్‌గా మీరెవరో తెలియకపోయినా... చాలా గౌరవం ఇస్తున్నానంటూ వ్యాఖ్యానించాడు. తనతో పద్ధతిగా మాట్లాడాలని సూచించాడు. ఉతికేస్తారు.. ఊడ్చేస్తారు.. వంటి పదాలేంటని అక్తర్ మండిపడ్డాడు.
ఇలాంటి ప్రశ్నలకు సమాధానమివ్వనని.. కేవలం క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నలను మాత్రమే అడగాలని సూచించాడు. షోయబ్ ఆగ్రహంతో యాంకర్ సర్దుకుంది. కాగా, అక్తర్ సహనం కోల్పోయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.