సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (18:12 IST)

200వ వన్డేకు కెప్టెన్‌గా వ్యవహరించాలని రాసిపెట్టివుంది: ధోనీ

భారత్‌కు ప్రపంచ కప్ సాధించి పెట్టిన కెప్టెన్లలో ఒకడైన టీమిండియా మాజీ సారథి ధోనీ మళ్లీ జట్టు కెప్టెన్‌గా పగ్గాలు స్వీకరించనున్నాడు. ఆసియా కప్‌లో భాగంగా ఆప్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్ నుంచి కెప్టెన్

భారత్‌కు ప్రపంచ కప్ సాధించి పెట్టిన కెప్టెన్లలో ఒకడైన టీమిండియా మాజీ సారథి ధోనీ మళ్లీ జట్టు కెప్టెన్‌గా పగ్గాలు స్వీకరించనున్నాడు. ఆసియా కప్‌లో భాగంగా ఆప్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్ నుంచి కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి కల్పించడంతో.. ధోనీ మరోసారి నాయకత్వ బాధ్యతలను స్వీకరించాడు. తద్వారా 200ల వన్డే మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఘనతను సాధించాడు. 
 
ఈ సందర్భంగా ధోనీ మాట్లాడుతూ.. 200వ వన్డేకు కెప్టెన్‌గా వ్యవహరించాలని రాసిపెట్టినట్టు ఉందని.. అంతా విధిరాత అంటూ తెలిపాడు. మరోవైపు టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. టీమిండియా జట్టులో ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ బౌలర్లు భువనేశ్వర్, బుమ్రా, చాహల్ లకు విశ్రాంతిని కల్పించారు. ఆప్ఘనిస్థాన్ జట్టులో రెండు మార్పులు జరిగాయి.