సోమవారం, 2 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 జనవరి 2024 (17:27 IST)

అభిమాని చెంపచెల్లునమనిపించిన షకీబ్ అల్ హసన్

Shakib Al Hasan
బంగ్లాదేశ్ క్రికెట్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ దేశ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన షకీబ్ ఒకటిన్నర లక్షల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అధికార అవామీ లీగ్ పార్టీ తరపున షకీబ్ పోటీ చేశారు.
 
కాగా, ఎన్నికల ఫలితాలు వెలువడటానికి కొన్ని గంటల ముందు ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. ఎన్నికల పోలింగ్ రోజున ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. 
 
పోలింగ్ బూత్‌లో ఓటు వేసి వస్తున్న షకీబ్‌ను అభిమానులు చుట్టుముట్టారు. ఓ అభిమాని ఆయనను వెనుక నుంచి పట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో, సదరు అభిమాని చెంపను షకీబ్ ఛెళ్లుమనిపించాడు.