1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 27 ఆగస్టు 2018 (17:51 IST)

కట్నం కోసం బంగ్లాదేశ్ క్రికెటర్ మొసద్ధక్ హుస్సేన్.. భార్యను వేధించాడా?

కట్నం కోసం బంగ్లాదేశ్ క్రికెటర్ మొసద్ధక్ హుస్సేన్ వేధించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మేరకు హుస్సేన్ సైకత్‌పై అతని భార్య వరకట్న వేధింపుల ఆరోపణలు చేసింది. కట్నం కోసం మొసద్దక్ తనను శారీరకంగా హింసిస్త

కట్నం కోసం బంగ్లాదేశ్ క్రికెటర్ మొసద్ధక్ హుస్సేన్ వేధించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మేరకు హుస్సేన్ సైకత్‌పై అతని భార్య వరకట్న వేధింపుల ఆరోపణలు చేసింది. కట్నం కోసం మొసద్దక్ తనను శారీరకంగా హింసిస్తున్నాడని ఆమె చెప్పింది. ఈ కేసుపై ఇప్పటివరకు మొసద్దక్ స్పందించలేదు. 
 
అయితే పెళ్లి జరిగినప్పటి నుంచే ఇద్దరికీ ఏ విషయంలోనూ పొసగడం లేదని అతని సోదరుడు మొసబ్బీర్ హుస్సేన్ చెప్పాడు. ఈ నెల 15నే ఉష అతనికి విడాకుల నోటీసులు పంపించిందని, అయితే ఆమె భారీ మొత్తం డిమాండ్ చేస్తున్నదని అతని తెలిపాడు. ఆ డబ్బు ఇవ్వనందుకే ఇలా తప్పుడు కేసు పెట్టిందని అతను ఆరోపించాడు.
 
కాగా 22 ఏళ్ల మొసద్దక్ ఆరేళ్ల కిందట తన కజిన్ అయిన షర్మిన్ సమీరా ఉషను పెళ్లి చేసుకున్నాడు. వచ్చేనెలలో జరగనున్న ఏషియా కప్ కోసం బంగ్లాదేశ్ సెలక్టర్లు అతనికి టీమ్‌లో చోటు కల్పించారు. మొసద్దక్ కట్నం కోసం వేధిస్తున్నట్లు అతని భార్య ఉష కేసు వేసినట్లు అడిషనల్ చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ రోసినా ఖాన్ వెల్లడించారు. 
 
దీనిపై సదర్ ఉపజిలా ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్‌ను కేసు విచారణ చేయాల్సిందిగా ఆదేశించారు. చాలా రోజులగా కట్నం కోసం ఉషను అతడు వేధిస్తున్నట్లు ఆమె తరఫు లాయర్ రెజౌల్ కరీమ్ దులాల్ చెప్పారు. పది లక్షల టాకాలు కట్నంగా ఇవ్వాలంటూ అతడు ఆమెను ఇంటి నుంచి వెళ్లగొట్టాడని ఉష తరపు లాయర్ వెల్లడించారు.